వరంగల్‌సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల అగ్రికల్చర్ మార్కెట్‌కు ఆరు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 15 వరకు మార్కెట్‌ను బంద్ చేయనున్నట్లు ఆఫీసర్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆరు రోజులు మార్కెట్‌లో ఎలాంటి క్రయ విక్రయాలు జరగవని, రైతులు తమ సరుకులు మార్కెట్‌కు తీసుకురావద్దని సూచించారు.
