నీళ్ల బిందెలో నాగుపాము కలకలం

నీళ్ల  బిందెలో నాగుపాము కలకలం

నాగులచవితి పర్వదినాన బిందెలో నాగుపాము కనిపించడం  కలకలం రేపింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న నీళ్ల బిందెలో నాగుపాము ప్రత్యక్షమైంది. రాత్రి సమయంలో బయట నుంచి వచ్చిన పాము ఇత్తడి బిందెలోకి దూరింది. ఎలుకలను తిని కదల్లేని పరిస్థితిలో అందులోనే ఉండిపోయింది. అయితే మరుసటి రోజు ఉదయం నీళ్ల కోసమని బిందెను తీయగా పాము బుసలు కొట్టింది. దీంతో ఇంటిలోని సభ్యులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో  అతను చాకచక్యంగా పామును పట్టుకుని అడవిలో వదిలేశాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాలలో నాగుల చవితి నాగుల చవితి సందర్భంగా ఆలయాలకు మహిళలు పోటెత్తారు. ఆలయం దగ్గర ఉన్న పుట్టలలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.  నాగల చవితి నాడు నాగదేవతను పూజిస్తే సర్వదోషాలు పోతాయని భక్తులు విశ్వశిస్తారు.