
-
త్వరలో మహిళలకు రూ.2,500 ఇస్తాం
-
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
-
మోమిన్‌పేటలో ‘మహాలక్ష్మి’ లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ
వికారాబాద్, వెలుగు: ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. మోమిన్ పేట మండల పరిషత్ ఆఫీసులో ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పొందుతున్న లబ్ధిదారులకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గడ్డం ప్రసాద్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా 6 గ్యారంటీలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. త్వరలో ‘మహాలక్ష్మి’ కింద మహిళలకు రూ.2,500 రూపాయలను పంపిణీ చేస్తామని చెప్పారు. అలాగే తులం బంగారం, ప్రైవేటు ఉద్యోగాల కల్పన, తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, శంకర్, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ పూర్ణచందర్ రావు, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, నాయకులు సుభాశ్‌గౌడ్, మహేందర్ రెడ్డి, సురేందర్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.