లండన్: హార్మూజ్ జలసంధి మూతపడటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుండటంతో యూరప్ దేశాలు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు రంగంలోకి దిగాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం నుంచి వెలువడిన ఈ ఆరు దేశాల ఉమ్మడి ప్రకటన.. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడాన్ని ఖండించింది. "హార్మూజ్ జలసంధిని అడ్డుకునే ప్రయత్నాలను ఇరాన్ వెంటనే నిలిపివేయాలని కోరుతున్నాం.
డ్రోన్, క్షిపణి దాడులతో అంతర్జాతీయ నౌకాయానాన్ని స్తంభింపజేయడం క్షమించరాని నేరం. హార్మూజ్ ద్వారా నౌకల సురక్షిత ప్రయాణానికి అన్ని ప్రయత్నాలలో ముందుంటాం. ఇంధన మార్కెట్లను స్థిరపరచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం " అని ఆరు దేశాలు పేర్కొన్నాయి.
