
దేశంలో పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్రమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, కర్నాటక సీఎం యెడియూరప్పలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారు తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా తెలిపారు. కర్నాటక సీఎంకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులకు కోవిడ్ పరీక్షలు చేయగా.. ఆయన కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. సీఎం యెడియూరప్ప కూడా అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సీఎం అధికారిక నివాసంలోని ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వారిని కలిసిన వాళ్లంతా హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.