6 వేల కోట్ల ఇన్‌కం టార్గెట్‌ పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం

6 వేల కోట్ల ఇన్‌కం టార్గెట్‌ పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం

ఆగస్టు 26 వరకు వేసిన వెంచర్లకు వర్తింపు
పెద్ద వెంచర్లలో ప్లాట్లు కొన్నవాళ్లపై భారం.. గ్రామాల్లోని లే ఔట్ల రెగ్యులరైజ్‌కు చాన్స్
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ప్రయోజనకరం

అనధికార లే ఔట్లు, ప్లాట్లకు ఎల్ ఆర్​ఎస్

ఖజానా నింపుకొనేందుకు అక్రమ వెంచర్లు, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కనీసం రూ.6 వేల కోట్ల ఇన్ కం సమకూర్చుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తూ .. సామాన్యుల నడ్డివిరిచేలా ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. హెచ్‌ఎండీఏతోపాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వేసిన లేఔట్ల క్రమబద్ధీకరణకు కూడా చాన్స్ ఇచ్చింది. ఆగస్టు 26 వరకు రిజిస్టరైన లే ఔట్లను కటాఫ్‌గా ప్రకటించింది. గతంలో కేవలం ప్లాట్ల రెగ్యులరైజేషన్‌‌కు మాత్రమే అనుమతినిచ్చిన సర్కారు.. ఈసారి అక్రమ వెంచర్లన్నీ సక్రమం చేసేందుకు తలుపులు తెరిచేసిందన్న విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఔట్లు, ప్లాట్ల రెగ్యులరైజేషన్  కోసం సర్కారు మరోసారి ఎల్ఆర్ఎస్​ ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. అన్ని అక్రమ లే ఔట్లను రెగ్యులరైజ్‌ చేసేందుకు ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ నోటిఫికేషన్‌లో అవకాశమిచ్చారు. చార్జీలను భారీగా పెంచి ఖజానాకు ఆదాయం దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో సర్కారు రెండుసార్లు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చింది. అప్పుడు కూడా లేఔట్ల రెగ్యులరైజేషన్‌కు అనుమతి ఇచ్చింది. 2015తో పోల్చితే 3 వేల గజాలలోపు వెంచర్లలోని ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ చార్జీలను 5%.. 5 వేల గజాల్లోపు ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ చార్జీలను 20%, 5 వేల గజాలపైబడిన వాటి చార్జీలను 35% పెంచారు. 10 వేల చదరపు గజాలుపైబడ్డ లే ఔట్ల క్రమబద్ధీకరణ కోసం రిజిస్ట్రేషన్‌ వ్యాల్యూతో సమానంగా (వంద శాతం) ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు.

మిడిల్ ​క్లాస్​పై భారం

గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు, మున్సిపాలిటీలకు సమీపంలోని గ్రామాల్లో ఉన్న అక్రమ వెంచర్లలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చిన్న తరహా వ్యాపారులు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇలా వేసిన వెంచర్లలో చాలా వరకు ఐదు వేల చదరపు గజాలపైన
ఉంటాయని తెలుస్తది. రాష్ట్రంలో 3,892 అక్రమ వెంచర్లు ఉన్నట్టు గుర్తించారు. 22,076 ఎకరాల్లో వేసిన ఈ లే ఔట్లలో 2 లక్షల 81 వేల 171 ప్లాట్లు ఉన్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేసిన సర్వేలో తేల్చారు. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో వేసిన లే ఔట్ల ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతిచ్చారు. గ్రామాల్లో ఎన్ని లే ఔట్లు ఉన్నాయన్న దానిపై స్పష్టమైన లెక్కలు లేవు. అవి మరో 2 వేలకుపైగానే ఉండవచ్చని అంచనా. కనీసం ఒక్కో వెంచర్‌ 2 ఎకరాలు, అంతకు మించే ఏర్పాటు చేస్తుంటారు. రెండెకరాల ఆరు గుంటల్లో వేసిన వెంచర్‌ అంటే .. 10 వేల చదరపు గజాలకు సమానం. ఈ లెక్కన 60 శాతానికిపైగా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు రిజిస్ట్రేషన్‌ వ్యాల్యూకు వంద శాతం అదనంగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో 30 వేల చదరపు గజాలు దాటిన లే ఔట్లకు 80 శాతం, 50 వేల చదరపు గజాలు దాటిన లేఔట్లకు వంద శాతం అదనంగా ఫీజు ఉండేది. ఇప్పుడు 10 వేల గజాలు దాటిన అన్ని వెంచర్లకు వంద శాతం ఫీజు పెట్టారు. రాష్ట్రంలో 3,892 అక్రమ లే ఔట్లు
ఉన్నట్టు గుర్తించగా.. వాటిలో 60 శాతానికిపైగా పది వేల చదరపు గజాలు దాటిన వెంచర్లే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 26 కటాఫ్‌‌ డేట్‌‌రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో ఆగస్టు 26 వరకు రిజిస్టరైన అక్రమ లేఔట్లను రెగ్యు లరైజ్‌‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . కటాఫ్‌‌ డేట్‌‌ నాటికి సదరు అక్రమ లే ఔట్ లో కనీసం పది శాతం ప్లాట్లు విక్రయించి ఉండాలని షరతు పెట్టింది . అర్బన్‌ ల్యాండ్‌‌ సీలింగ్‌‌ యాక్ట్‌‌ పరిధిలోని భూములు, నిషేధిత, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, అసైన్డ్ భూములు, దేవాలయ, వక్ఫ్ భూముల్లో వేసిన లేఔట్లను క్రమబద్ధీకరించడానికి అవకాశం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సేల్‌‌ డీడ్‌‌, టైటిల్‌‌ డీడ్‌‌ ఉన్న లే ఔట్లను మాత్రమే క్రమబద్ధీకరణకు అనుమతిస్తామని, జనరల్‌‌ పవర్‌‌ ఆఫ్‌‌ అటార్నీ అగ్రిమెంట్‌‌ ఉన్నవి పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. నదులు, నాలాలు, చెరువులు, సరస్సుల శిఖం భూముల్లో వేసిన లే ఔట్ల పరిగణనలోకి తీసుకోరు. గ్రీన్‌ జోన్‌ , బఫర్‌‌ జోన్‌ లోని వెంచర్లనూ క్రమబద్ధీకరించరు.

అక్టోబర్‌ 15 వరకు అప్లికేషన్లు
అక్రమ ప్లాట్లు, వెంచర్ల క్రమబద్ధీకరణకు అక్టోబర్‌‌ 15 వరకు చాన్స్‌ ఇచ్చారు. ఆన్‌ లైన్‌ లో అప్లికేషన్‌ చేసుకోవాలని.. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా ప్లాట్‌‌ ఓనర్‌‌ రూ. వెయ్యి, లేఔట్‌‌ డెవలపర్‌‌ రూ.10 వేలు చెల్లిం చాలని పేర్కొన్నారు. అప్లికేషన్‌ తో పాటు సెల్ఫ్‌‌ అటెస్టెడ్‌‌ టైటిల్‌‌ డీడ్‌‌ ఫస్ట్‌‌ పేజీ, ఇతర డాక్యుమెంట్‌‌ సమర్పించాల్సి ఉంటుంది.

ఇవీ నిబంధనలు
నాలాకు కనీసం 2 మీటర్ల దూరం ఉండాలి. వాగులు, శిఖం భూమికి 9 మీ. దూరం ఉండాలి. 10 హెక్టార్లలోపు విస్తీర్ణమున్న ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి. 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి. ఎయిర్‌‌ పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి.

For More News..

సింప్టమ్స్ లేనోళ్లలోనే.. వైరల్ లోడ్ ఎక్కువ