PEDDI First Song: రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘చికిరి..చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే!

PEDDI First Song: రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘చికిరి..చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (PEDDI). రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్.. ఈ చిత్రంపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పటికే, మూవీ 70% షూటింగ్ సైతం కంప్లీట్ చేసుకుంది. అలా ఓ పక్క షూటింగ్ జరుగుతూనే, మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ మేరకు హీరో రామ్ చరణ్ ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్, సింగర్ మోహిత్ చౌహాన్, డైరెక్టర్ బుచ్చి బాబు కలిసి దిగిన ఫొటోను చరణ్ షేర్ చేశారు. ‘ఏం ప్లాన్ చేస్తున్నారు. ఏం జరుగుతోంది’అంటూ చరణ్ ప్రశ్నించగా.. ‘చికిరి..చికిరి’ సార్ అంటూ ఏఆర్ రహమాన్, బుచ్చిబాబు రిప్లై ఇచ్చారు. అయితే, సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం అనౌన్స్ చేయలేదు.

ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతుందని, ఆ పాట ‘చికిరి’ అనే పదంతో హమ్మింగ్ అవ్వబోతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. చాన్నాళ్ల పాటు గుర్తుండిపోయేలా రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. 

ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా శ్రీలంకలో పెద్ది షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్, జాన్వీలపై లవ్ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసినట్లు ఇటీవలే కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. మరి ఇపుడు చాటింగ్లో చర్చించుకున్నట్లుగా వచ్చేది లవ్ సాంగ్ హా? లేక వేరేదా? అనేది తెలియాల్సి ఉంది. రెహమాన్ కూర్చున్న సిట్టింగ్ ప్లేస్ చూస్తే.. అదే రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. అయితే, పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడు అన్నది కూడా వైరల్ అవుతుంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ నెల నవంబర్ 8న హైదరాబాద్‌ RFCలో ఏఆర్ రెహమాన్ స్పెషల్ ఈవెంట్‌ ఉంది. ఇందులో భాగంగా సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ‘చికిరి..చికిరి’ ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిజం చెప్పాలంటే.. రెహమాన్ ట్యూన్స్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ షాట్ గ్లింప్స్‌లోనే ‘పెద్ది.. పెద్ది.. పెద్ది’ అంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు రెహమాన్. చరణ్ సిగ్నేచర్ షాట్ మరింత హైలెట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే సాంగ్స్పై భారీ హైప్ నెలకొంది. 

ఇక ఈ చిత్రంలో అందాల భామ జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' రోల్లో కని పించనుంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.