వాకింగ్ లేదా రన్నింగ్ : కొవ్వు తగ్గడంలో ఏది బెస్ట్ ? నిపుణులు ఎం చెబుతున్నారంటే..?

వాకింగ్ లేదా రన్నింగ్ : కొవ్వు తగ్గడంలో ఏది బెస్ట్ ? నిపుణులు ఎం చెబుతున్నారంటే..?

మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా... ముఖ్యంగా ఆకలిని కాంట్రొల్లో  పెట్టుకుంటూ, శరీర కొవ్వు(body fat) తగ్గడానికి పరుగు కంటే నడకే ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ కునాల్ సూద్ చెప్పిన ప్రకారం మీరు పరుగెత్తినప్పుడు, మీ శరీరం శక్తి కోసం ఎక్కువగా కార్బోహైడ్రేట్లను వాడుకుంటుంది. పరుగు కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను పెంచుతుంది, దీనివల్ల చక్కెర (కార్బోహైడ్రేట్) తినాలనే కోరిక పెరుగుతుంది. పరుగు కొవ్వు తగ్గడానికి మంచిది కాకపోవచ్చు, పరుగులో నిమిషానికి ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయన్నది నిజమే.. కానీ దానివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. పరుగు వల్ల కార్టిసాల్ పెరిగి, మీకు ఆకలి ఎక్కువై ఆ తర్వాత ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది.

 డాక్టర్ సూద్ చెప్పినట్లు, కార్టిసాల్ ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం కొవ్వును వదలడానికి ఇష్టపడదు. ఈ ఒత్తిడి జీవక్రియను నెమ్మదిస్తుంది, పొట్ట చుట్టూ కొవ్వు చేరడానికి కారణమవుతుంది. జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో వచ్చిన పరిశోధన ప్రకారం, అధిక తీవ్రతతో చేసే వ్యాయామాలు అంటే పరుగు వంటివి 24 గంటల వరకు కార్టిసాల్ స్థాయిలను పెంచుతాయి.

నడక మీ హార్ట్ బీట్ రేటును 'కొవ్వును కాల్చే జోన్' లో ఉంచుతుంది.  మీ శరీరం శక్తి కోసం కార్బోహైడ్రేట్ల కంటే, నిల్వ ఉన్న కొవ్వును ఎక్కువగా ఉపయోగిస్తుంది. నడక తక్కువ ప్రభావం చూపడం వల్ల, అది కార్టిసాల్‌ను అంతగా పెంచదు. మీరు కేలరీలు బర్న్ చేస్తారు, కానీ శరీరానికి సున్నితంగా ఉండే విధంగా అని డాక్టర్ సూద్ చెబుతన్నారు.

 ఈ సున్నితమైన వ్యాయామం వల్ల మీరు వారాల పాటు కాకుండా, నెలల తరబడి స్థిరంగా చేయవచ్చు. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా ఆకలి హార్మోన్లను నియంత్రించి, ఆ తర్వాత చక్కెర పదార్థాల కోరికలను తగ్గిస్తుంది. ఒబేసిటీ రివ్యూస్ జర్నల్‌లో వచ్చిన 2023 రివ్యూ ప్రకారం, మితమైన నడక కొవ్వు కరిగే తీరును మెరుగుపరుస్తుంది.
 
పరుగు కంటే నడకకు ఉన్న అతిపెద్ద ప్రయోజనం ప్రతిరోజు కంటిన్యూ చేయడం. ఇందుకు మీకు కాస్ట్లీ  షూలాంటివి అవసరం లేదు. కావలసింది ప్రతిరోజు కొంత టైం. ఫిట్‌నెస్ నిపుణులందరూ చెప్పేదేమిటంటే మీరు ప్రతిరోజూ చేసే వ్యాయామమే బెస్ట్. రోజు నడక అలవాటు  ఆందోళనను తగ్గించి, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
 
గుండె ఆరోగ్యానికి (Cardiovascular Endurance) ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి పరుగు ఇప్పటికీ మంచిదే. మీకు కీళ్ల సమస్యలు లేకపోతే, రెండు చేయడం కూడా మంచిది. అంటే వారానికి రెండు, మూడు రోజులు పరుగెత్తి, మిగిలిన రోజుల్లో నడవండి. ఇది ఒత్తిడి పెంచకుండా స్టామినా పెంచుతుంది.

కొవ్వు తగ్గడం అనేది వేగంగా పరిగెత్తే స్ప్రింట్ కాదు, ఒక మారథాన్ లాంటిది. నడకతో మీకు అంత చెమట పట్టకపోవచ్చు, కానీ  మీ హార్మోన్లను ప్రశాంతంగా, జీవక్రియను స్థిరంగా ఉంచుతుంది. డాక్టర్ సూద్ చెప్పినట్లు పరుగు ఎక్కువ కేలరీలు బర్న్ చేసినా, నడక కొవ్వును మరింత బర్న్ చేయడానికి సహాయపడుతుంది,