Beauty Tips: డార్క్ చాక్లెట్తో స్కిన్ డ్యామేజ్ తగ్గించొచ్చు

Beauty Tips: డార్క్ చాక్లెట్తో స్కిన్ డ్యామేజ్ తగ్గించొచ్చు

పొల్యూషన్, నన్ డ్యామేజ్, ఆన్ హెర్డీ బైఫ్ స్టైల్ వల్ల చర్మానికొచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. వీటివల్ల యాక్నె, ముడతలు, వైట్ హెడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. వీటన్నింటికి సొల్యూషన్ కడుపునిండా తినడమే.. అయితే ఆ తిండిలో ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. అలా స్కిన్ని డ్యామేజ్ నుంచి రిపేర్ చేసే సూపర్ ఫుడ్స్ ఇవి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చితే చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు ఫుడ్ టెక్ సైంటిస్ట్ కె. పవిత్ర. 

హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్ "లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ, అవన్నీ చాలావరకు కెమికల్స్ తో నిండినవే. నేచురల్ పేరుతో వచ్చే ప్రొడక్ట్స్ లోనూ రంగు కోసమో, టెక్స్చర్ కోసమో ఎంతో కొంత కెమికల్ కలుపుతారు. ఇవన్నీ ఇలా ఉంచితే ఆ ప్రొడక్ట్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ అది కొంతకాలమే. శ్రీములు, లోషన్లకి బ్రేక్ ఇస్తే మళ్లీ స్కిన్ వల్ అవుతుంది. అందుకే నేచురల్ గా స్కిన్ని రిపేర్ చేసుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా ఈ ఫుడ్ తినాలి. 

• గుడ్డులో స్కిన్ని హెల్దీగా మార్చే నూట్రియెంట్స్ ఉంటాయి. వీటిల్లోని లుటైన్, వైట్ మల్టీ విటమిన్స్ స్కిన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ప్రొటీన్స్ చర్మ కణాల్ని రిపేర్ చేస్తాయి. అయితే గుడ్లని ఎలా తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. గుడ్లని ఉడకబెట్టి లేదా సలాడ్, ఆమ్లెట్ గా తినాలి. గుడ్డు పచ్చసొన వల్ల చర్మం పాడవుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ, అందులోని ఫ్యాటీయాసిడ్స్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, గ్లో ఇస్తాయి. 

* విటమిన్-సి, ఇఎక్కువగా ఉండే అవకాడో చర్మానికి చాలా మేలు చేస్తుంది. వీటిల్లో ఉండే విటమిన్స్, ఫ్యాట్స్ వల్ల యాక్నె, తామర లాంటి సమస్యలు దూరమవుతాయి. చర్మంపై ముడతల్ని తగ్గిస్తాయి. స్కిన్ డ్యామేజ్, ఇన్. ఫ్లమేషన్తో పాటు స్కిన్ క్యాన్సర్ నుంచి బయటపడేస్తాయి. అవకాడోలో బి-కాంప్లెక్స్ విటమిన్స్ లో ఒకటైన బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది డ్రై స్కిన్ నుంచి కాపాడుతుంది. అలాగే జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి కూడా అవకాడో చాలా మంచిది. 

• విటమిన్-బి, యాంటీ ఆక్సిడెంట్స్తో నిండిన వాల్నట్స్ అయితే సూర్య కిరణాలు, దుమ్ము, ధూళి నుంచి చర్మాన్ని కాపాడతాయి. ప్రి మెచ్యూర్ ఏజింగ్ అంటే చిన్న వయసులోనే ముఖంపై వచ్చే ముడతల్ని రానీయవు. వీటిల్లోని విటమిన్ - ఇస్కిన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో వయసు ఛాయలు కనిపించవు. డార్క్ సర్కిల్స్, చుండ్రు సమస్యల్ని నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది అవకాడో. 

• డార్క్ స్పాట్స్ నుంచి తప్పించుకోవాలంటే బాదం తినాల్సిందే. వీటిల్లోని విటమిన్ -ఇ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీగా పనిచేస్తుంది. దానివల్ల ఏజింగ్ కి దారితీసే ఫ్రీ ర్యాడికల్స్ బ్లాక్ అయి యాక్నె సమస్యలు రావు. అలాగే వీటిల్లోని విటమిన్స్ చర్మానికి సరిపడా తేమ, గాలి అందడానికి సాయం చేస్తాయి. దానివల్ల డార్క్ సర్కిల్స్ తో పాటు కళ్ల ఉబ్బు కూడా తగ్గుతుంది. వీటిలోని ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చూస్తాయి. దానివల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా, అందంగా పెరుగుతుంది. 

* జీడిపప్పులోనూ విటమిన్ -ఇతోపాటు జింక్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. ఇవి స్కిన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. వివిధ కారణాల వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేస్తాయి. అలాగే పిస్తాలోని యాంటీ ఆక్సిడెంట్స్ యాక్నెని కంట్రోల్ చేస్తాయి. ఆయిల్ స్కిన్ దూర చేస్తాయి. అందుకే జిడిపప్పు, పిస్తా తినాలి. 

చాక్లెట్స్ లలో ఉండే షుగర్ కంటెంట్, డైరీ ప్రొడక్ట్స్ వల్ల యాక్నె సమస్యలొస్తాయన్న మాట నిజమే. కానీ, వీటిని రెగ్యులర్ తింటేనే ఆ ఇబ్బందులు. ఇవన్నీ పక్కనపెడితే స్కిన్ని హెల్దీగా మార్చే చాక్లెట్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో డార్క్ చాక్లెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటి తయారీలో 70 నుంచి 85శాతం కోకో పౌడర్ ఉంటుంది.

వాటిలోని కాపర్, జింక్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం డెడ్ స్కిన్ సెల్స్ని తొలగిస్తాయి. ఈ చాక్లెట్స్ తినడం వల్ల సన్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని కాపాడు కోవచ్చు కూడా. అన్నింటికన్నా ముఖ్యంగా చర్మానికి స్పూత్ టెక్స్చర్ ని ఇస్తాయి ఇవి.