
హైదరాబాద్, వెలుగు: స్కోడా ఇండియా.. కొత్త తరం కోసం స్కోడా కోడియాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 4x4 ఎస్‌యూవీ. హైదరాబాద్ కొండాపూర్‌లోని పీపీఎస్ మోటార్స్ స్కోడా షోరూంలో దీన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జానెబా మాట్లాడుతూ, “మార్చి నెలలో మేం భారతదేశంలో ఒక నెల అమ్మకాల్లో అత్యధిక వృద్ధి సాధించాం. కోడియాక్‌తో సేల్స్ మరింత పెరుగుతాయి” అని చెప్పారు.