తుపాను వస్తదని ముందే ఆకాశం చెప్పింది…

తుపాను వస్తదని ముందే ఆకాశం చెప్పింది…

 ‘హగిబీస్‌’కు ముందు జపాన్‌లో రంగుమారిన ఆకాశం

  ప్రకృతి వార్నింగ్‌ ఇచ్చిందంటున్న ప్రజలు

‘పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి.. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడుతాడు.. వాడు మనిషిలా కాదు.. మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు’ ఓ హిట్‌‌‌‌ సినిమా డైలాగ్‌‌‌‌ ఇది. ప్రకృతి కూడా కన్నెర్రజేసినప్పుడు ఇలాంటి సంకేతాలనే పంపిస్తుందని, శనివారం హగిబీస్ తుపాను బీభత్సం సృష్టించడానికి ముందు కూడా ఇట్లాగే హింటిచ్చిందని ఇప్పుడు జపాన్ జనాలు భయం భయంగా చెప్పుకుంటున్నారు. తుపాను రావడానికి ముందు ఆకాశమంతా ఎరుపు, ఊదారంగుతో నిండిపోయి కనిపించిందని అంటున్నారు.

ఇంతకూ ఏం జరిగిందంటే..

భారీ తుపాన్లు వచ్చేటప్పుడు ఆకాశం రంగులు మారడం మామూలు విషయమేనని సైంటిస్టులు అంటున్నారు. రిఫ్రాక్షన్ (కాంతి వంపులు తిరగడం) ప్రక్రియ వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు. సూర్యకాంతి తెల్లగా కనిపించినా ఇందులో వేర్వేరు వేవ్‌‌‌‌లెన్త్స్‌‌‌‌లో ప్రయాణించే 7 వేర్వేరు రంగుల కాంతులు ఉంటాయని తెలిసిందే. ఇవి ట్రాన్స్‌‌‌‌పరెంట్ పదార్థాల ద్వారా పోయినప్పుడు విడిపోయి రంగులు రంగులుగా కనిపిస్తాయి. దీనినే రిఫ్రాక్షన్ అంటారు. వాతావరణంలోని వాయువులు, ధూళి, మంచు కణాలపై కాంతి పడినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈ ఏడు రంగుల్లో నీలం, ఊదా రంగులకు చాలా తక్కువ తరంగదైర్ఘ్యాలుంటాయి. అందువల్ల ఇవి ట్రాన్స్ పరెంట్  పదార్థాలపై పడినప్పుడు అన్ని వైపులకూ చెల్లాచెదురవుతాయి. కానీ సైక్లోన్‌‌‌‌లు, టైఫూన్‌‌‌‌లు వచ్చినప్పుడు విపరీతమైన గాలులు వీయడం వల్ల సముద్రాలపై పెద్ద పార్టికల్స్ దూరంగా పోయి చిన్న మాలిక్యూల్స్ పెరుగుతాయి. దీంతో వాతావరణంలో తక్కువ వేవ్‌‌‌‌లెన్త్స్‌‌‌‌ ఉండే గులాబీ, ఉదా రంగులే అంతటా వెదజల్లినట్లు కనబడతాయి. అందుకే ఆకాశం ఈ రెండు రంగుల్లో కనిపిస్తుందట. నీలం రంగు  బ్యాగ్రౌండ్ పై గులాబీ రంగు కమ్ముకున్నప్పుడూ ఇలాగే కనిపిస్తుందట.

నీలం రంగు మాయమై..

హగిబీస్ అంటే ఫిలిప్పినో భాషలో ‘స్పీడ్’ అని అర్థం. జపాన్‌‌‌‌ను చుట్టుముట్టిన హగిబీస్ తుపాను కూడా శనివారం వేగంగా పెను విధ్వంసం సృష్టించింది. అదేరోజు జపాన్ ఆగ్నేయ తీరంలో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూకంపం కూడా వచ్చింది. అయితే.. అంతకు ఒక్కరోజు ముందే అక్కడి ఆకాశంలో ఓ వింత జరిగింది. ఆకాశంలో నీలం రంగు మాయమై ఎరుపు, గులాబీ, ఊదా రంగుల మిశ్రమంతో నిండిపోయింది. రాబోయే విపత్తు గురించి హెచ్చరిస్తూనే ఆకాశం ఇలా సంకేతం పంపిందంటూ జపాన్ ప్రజలు ఆ ఫొటోలను విపరీతంగా షేర్
చేసుకున్నారు.