స్లమ్ డాగ్ హస్బెండ్.. నవ్వులు గ్యారెంటీ

స్లమ్ డాగ్ హస్బెండ్..  నవ్వులు గ్యారెంటీ

‘పిట్ట కథ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటించిన మరో సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్.  ఏ ఆర్ శ్రీధర్ దర్శకత్వంలో అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన  ప్రెస్‌‌మీట్‌‌లో అతిథిగా హాజరైన సత్యదేవ్ మాట్లాడుతూ ‘ఈ కాన్సెప్ట్ నాకు ముందే తెలుసు. ‘జ్యోతిలక్ష్మి’ సినిమా టైమ్‌‌లోనే విన్నాను. కానీ ఇంత ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఉంటుందని అనుకోలేదు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సంజయ్, ప్రణవిలకు ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. సంజయ్ రావు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను మాసీగా కనిపిస్తాను.

డైరెక్టర్ శ్రీధర్ నవ్వుతూ ఈ  స్క్రిప్ట్‌‌ చెప్పారు. కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమా బాగోకపోతే సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు పెట్టినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా’అని అన్నాడు. ట్రైలర్‌‌‌‌లో ఉన్నదానికంటే ఎక్కువ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఉంటుంది అని చెప్పింది ప్రణవి. ‘ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. థియేటర్స్‌‌లో నవ్వులు గ్యారెంటీ’ అని చెప్పాడు శ్రీధర్. నిర్మాత అప్పిరెడ్డి, బ్రహ్మాజీ, యాదమ రాజు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.