అమిత్ షా టూర్ లో స్వల్ప మార్పు.. RRR టీమ్తో భేటీ రద్దు

అమిత్ షా టూర్ లో స్వల్ప మార్పు.. RRR టీమ్తో భేటీ రద్దు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.  ఢిల్లీలో ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో RRR టీమ్ తో భేటీ రద్దు అయినట్లుగా బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా బీజేపీ నేతలతో జరగాల్సిన ఓ సమావేశాన్ని కూడా ఆయన రద్దు చేసుకున్నారు.  

ఢిల్లీలో ఇతర కార్యక్రమాలు ఉండటం వలన ముందుస్తు షెడ్యూల్ కంటే హైదరాబాద్ కు అమిత్ షా కాస్త ఆలస్యంగా రానున్నారు. చేవేళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో  అమిత్ షా పాల్గొననున్నారు. అయితే ఇదే టైమ్ లో RRR టీమ్ తో అమిత్ షా భేటీ ప్లాన్ చేశారు.

కానీ  ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటం వలన షెడ్యూల్ లో మార్పు చోటుచేసుకుంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో అమిత్ షా హైదరాబాద్ కు చేరుకుని నేరుగా చేవేళ్ల సభలో పాల్గొననున్నారు.  సభ అనంతరం ఢిల్లీకి  వెళ్లనున్నారు.  

పార్లమెంటరీ ప్రవాస్  యోజన ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న మొదటి బహిరంగ సభ ఇదే కావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. మూడు రోజులుగా  సభ ఏర్పాట్లలో రాష్ట్ర నేతలు మునిగారు.

ఏప్రిల్ 20 బండి సంజయ్ ఏర్పాట్లను పరిశీలించి, జన సమీకరణపై పార్టీ నేతలతో చర్చించారు. కనీసం లక్ష మందిని సభకు తరలించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు శ్రమిస్తున్నారు. హైదరాబాద్ సిటీకి వేదిక దగ్గరగా ఉండడం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగనుండడంతో పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు