పిల్లల్ని జో కొట్టండిలా..

పిల్లల్ని జో కొట్టండిలా..

కొందరు పిల్లలు నిద్రపోకుండా ఒకటే ఏడుస్తుంటారు. ఇలాంటి పిల్లలు త్వరగా నిద్రపోయేలా చేసేందుకు కొన్ని చిట్కాలున్నాయి. వాటిని ఫాలో అయితే, పిల్లలు ఈజీగా నిద్రపోతారు.  పిల్లల బుగ్గలపై. నుదిటిపై  మృదువుగా రెండు చేతుల బొటనవేళ్లతో మసాజ్‌‌ చేస్తే తొందరగా నిద్రపోతారు. సాఫ్ట్‌‌ టిష్యూ పేపర్‌‌‌‌తో చెంపలు, నుదుటిపై మృదువుగా తుడవాలి. ఇలా చేసేటప్పుడు గట్టిగా తుడవొద్దు. పాపాయిని ఎత్తుకుని సింక్‌‌ దగ్గర పంప్​ ఆన్‌‌ చేయాలి. నీళ్ల శబ్దం వాళ్లను నిద్రలోకి జారుకునేలా చేస్తుందని ఒక సర్వే చెప్పింది. పిల్లలు నిద్రపోయేటప్పుడు తల్లిదండ్రులు నోటితో ఏదో ఒక శబ్దం చేస్తుంటారు. అది రెండక్షరాల శబ్దం అయితే బెటర్​ అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. ‘ఉమ్‌‌, ఇష్‌‌..’ వంటి సౌండ్స్​ అయితే పిల్లలు త్వరగా నిద్రపోతారట.  మెత్తటి బట్టలే వేయాలి. చెమటను పీల్చుకుని, కంఫర్ట్‌‌గా ఉండే డ్రెస్‌‌లు వేస్తే మంచిది.  రాత్రిపూట నిద్రపోకుండా మారాం చేస్తుంటే, పగటిపూట నిద్ర పోనీయకుండా వాళ్లని ఎంటర్​టైన్​ చేయాలి. పిల్లలు నిద్రపోయే గదిలో వెలుతురు తక్కువగా ఉండాలి. గాలి సరిగ్గా ఆడాలి. ఎలాంటి సౌండ్ పొల్యూషన్‌‌ ఉండకూడదు. కొన్ని రకాల సౌండ్స్‌‌, వైబ్రేషన్స్‌‌ వంటివి పిల్లలు త్వరగా నిద్రపోయేందుకు ఉపయోగపడతాయి.