కరీంనగర్‌‌‌‌లో రూ.100 కోట్ల పనులపై ఎఫెక్ట్‌‌‌‌

కరీంనగర్‌‌‌‌లో రూ.100 కోట్ల పనులపై ఎఫెక్ట్‌‌‌‌

స్మార్ట్‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌ గడువు ముగియడంతో కరీంనగర్‌‌‌‌ సిటీలో రూ. 100 కోట్లపైగా విలువైన పనులపై ప్రభావం పడనుంది. నగరంలో రూ.1,094 కోట్లలో రూ.979 కోట్ల విలువైన 49 పనులు పూర్తి కాగా, రూ.115 కోట్లతో చేపట్టిన 12 పనులు పూర్తి కాలేదు. నగరంలోని టవర్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ను రూ.38 కోట్లతో అభివృద్ధి చేసి టూరిస్ట్‌‌‌‌లను ఆకర్షించేలా ఆర్టిటెక్ట్స్‌‌‌‌, ఎలివేషన్స్‌‌‌‌ ఇవ్వాలని భావించారు. అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైన్‌‌‌‌, కలర్‌‌‌‌ ఫుల్‌‌‌‌ స్క్రీట్‌‌‌‌లైట్ల ఏర్పాటుకు ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేశారు. ఇందులో రూ.16 కోట్ల పనులు మాత్రమే పూర్తి కాగా.. రూ.22 కోట్ల విలువైన పనులను మొదలే పెట్టలేదు. రూ.26 కోట్లతో అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైనేజీ నిర్మించాల్సి ఉండగా.. కేవలం రూ.6 కోట్ల పనులు చేపట్టి వదిలేశారు. కేబుల్‌‌‌‌ బ్రిడ్జి సమీపంలో రూ.16 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌‌‌‌ కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ పనులు చేపట్టగా.. రూ.12 కోట్ల పనులు మాత్రమే చేశారు. 

కశ్మీర్‍గడ్డలో రూ. 10 కోట్లతో చేపట్టిన మార్కెట్‌‌‌‌ పనులు 60 శాతం మిగిలిపోయాయి. రూ.7 కోట్లతో డిజిటల్‌‌‌‌ లైబ్రరీ, రూ.8 కోట్లతో స్మార్ట్‌‌‌‌ క్లాస్‍రూమ్స్, రూ.2 కోట్లతో బాలసదనం పనులు పూర్తి చేయలేకపోయారు. మల్టీజోన్‌‌‌‌ కార్‌‌‌‌ పార్కింగ్‌‌‌‌, వేస్ట్‌‌‌‌ వాటర్‌‌‌‌ మేనేజ్‍మెంట్‍, మోడ్రన్‌‌‌‌ స్లాటర్‌‌‌‌ హౌస్‌‌‌‌ పనులను ముట్టుకోనేలేదు. రెయిన్‌‌‌‌ వాటర్‌‌‌‌ హర్వెస్టింగ్‌‌‌‌ కోసం ప్రభుత్వ స్థలాలు, ఆఫీసుల్లో 106 చోట్ల పిట్స్‌‌‌‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం 50తోనే సరిపెట్టారు. రూ.26 కోట్లతో ఏర్పాటు చేయాల్సిన సాలిడ్‍ వేస్ట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ను రద్దు చేశారు. ట్రాఫిక్‌‌‌‌ కంట్రోల్‍, ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌, మొబిలిటీని రెగ్యులేట్‌‌‌‌ చేయడం వంటి పనులేవీ చేపట్టలేదు.