తెలంగాణలో స్మార్ట్ సిటీ మిషన్ గడువు పెంచలేం .. ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

తెలంగాణలో స్మార్ట్ సిటీ మిషన్ గడువు పెంచలేం .. ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో స్మార్ట్ సిటీ మిషన్ గడువును జూన్ 2026 వరకు పెంచడం సాధ్యం కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

స్మార్ట్ సిటీస్ మిషన్ ఈ ఏడాది మార్చి 31న ముగిసిందని, ఇకపై పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఇంకా మిగిలిన పనులను ప్రతి సిటీలో ఉన్న ప్రత్యేక సంస్థల (ఎస్పీవీ) ద్వారా పూర్తి చేయాలని సూచించారు.