ఇంటి పనుల్లో అలసట లేకుండా స్టార్ట్ టూల్స్.. ఇవి ఉంటే కష్టపడాల్సిన పనిలేదు

ఇంటి పనుల్లో అలసట లేకుండా స్టార్ట్ టూల్స్.. ఇవి ఉంటే కష్టపడాల్సిన పనిలేదు

ఎలక్ట్రిక్ స్పిన్‌‌ స్క్రబ్బర్‌‌‌‌

ఫ్లోర్ మీద, కిచెన్‌‌ షెల్ఫుల్లో జిడ్డు మరకలు, సిలిండర్ పెట్టే ప్లేస్‌‌లో తుప్పు వదిలించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ.. ఈ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్‌‌‌‌తో ఎలాంటి మొండి మరకలనైనా చాలా ఈజీగా క్లీన్‌‌ చేయొచ్చు. వర్నిరాజ్‌‌ అనే కంపెనీ దీన్ని అమ్ముతోంది. స్విచ్‌‌ ఆన్‌‌ చేస్తే చాలు స్క్రబ్బర్‌‌‌‌ వేగంగా తిరుగుతూ మరకలను తుడిచేస్తుంది. దీంతో పాటు 7రకాల రీప్లేసబుల్ క్లీనింగ్ బ్రష్‌‌లు వస్తాయి. టైల్స్‌‌ ఫ్లోర్లు, గోడలు, పూల్స్‌‌.. ఒక్కో పనికి ఒక్కో బ్రష్‌‌ని వాడుకోవచ్చు. 

వీటిని కారు పాలిష్, వ్యాక్సింగ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇందులో 2,500 mAh బ్యాటరీ ఉంటుంది. మోటారు 400 ఆర్‌‌‌‌పీఎంతో తిరుగుతుంది. స్పీడ్‌‌ని కూడా అడ్జెస్ట్‌‌ చేసుకోవచ్చు. టైప్‌‌ సీ కేబుల్‌‌తో 2 గంటల పాటు చార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఒక్క చార్జ్‌‌తో దాదాపు 120 నిమిషాల పాటు వాడుకోవచ్చు. ఇది 70డీబీ కంటే తక్కువ సౌండ్‌‌ చేస్తుంది. స్క్రబ్బర్‌‌‌‌ మెషిన్‌ నుంచి  టెలిస్కోపిక్ ఎక్స్‌‌టెన్షన్ రాడ్‌‌ను వేరు చేయొచ్చు. దాన్ని 12 అంగుళాల నుంచి 54 అంగుళాల వరకు అడ్జెస్ట్‌‌ చేసుకోవచ్చు. 
ధర : రూ. 1,689

వ్యాక్యూమ్‌‌ క్లీనర్‌‌‌‌ 

పిల్లలు ఉండే ఇంట్లో రోజుకు నాలుగు సార్లు క్లీన్‌‌ చేసినా చెత్త పడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ కార్డ్‌‌లెస్‌‌ వ్యాక్యూమ్‌‌ క్లీనర్‌‌‌‌ని వాడితే సరిపోతుంది. ఇందులో హై–స్పీడ్ బ్రష్‌‌లెస్ మోటార్ ఉంటుంది. అది వెంట్రుకలు, ధూళి, దుమ్ము, చెత్తను ఈజీగా లాగేస్తుంది. నాలుగు 2,200mAh బ్యాటరీలు ఉంటాయి. 

కాబట్టి 35 నిమిషాల వరకు పవర్‌‌‌‌ఫుల్‌‌ ఫేడ్ ఫ్రీ సక్షన్‌‌తో పనిచేస్తుంది. ఆ తర్వాత బటన్‌‌ని ప్రెస్‌‌ చేసి డస్ట్ కప్ ఖాళీ చేసేయొచ్చు. దీనికి ముందు భాగంలో ఎల్‌‌ఈడీ లైట్‌‌ కూడా ఉంటుంది. చీకటిగా ఉండే మూలలను కూడా ఈజీగా క్లీన్‌ చేయొచ్చు. ఇది ఫోల్డింగ్‌‌ ట్యూబ్‌‌తో రావడం వల్ల టేబుళ్లు, సోఫాల కింద కూడా వాడొచ్చు. 
ధర : రూ. 6,999

మాప్‌‌కాప్‌‌

సోఫాలు, కారు సీట్ల సందుల్లో దుమ్ము, చెత్త పేరుకుపోతుంటుంది. సాధారణంగా వాటిని క్లీన్‌‌ చేయడం అంత ఈజీ కాదు. కానీ.. ఈ పోర్టబుల్‌‌ వ్యాక్యూమ్‌‌ క్లీనర్‌‌‌‌తో సులభంగా క్లీన్‌‌ చేయొచ్చు. దీన్ని పోర్ట్రోనిక్స్‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. ఎక్కడైనా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. 

ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఎకో ఫ్రెండ్లీ హెపా ఫిల్టర్‌‌తో వస్తుంది. దీన్ని కడిగి మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. ఇది దుమ్ము, అలెర్జీ కారకాలను శక్తివంతంగా లాగేస్తుంది. దీనికి ఇంటిగ్రేటెడ్ ఎల్‌‌ఈడీ ఫ్లాష్‌‌లైట్ కూడా ఉంటుంది. కారు ఇంటీరియర్స్, కార్పెట్స్‌‌ని క్లీన్‌‌ చేయడానికి ప్రత్యేకంగా నాజిల్స్‌‌ ఉంటాయి. 
ధర : రూ. 1,299