ఫోన్‌‌ అడిక్షన్ తగ్గాలంటే..!

ఫోన్‌‌ అడిక్షన్ తగ్గాలంటే..!

స్మార్ట్‌‌ఫోన్‌‌ చేతిలో లేకపోతే కొందరు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. పక్కనే ఉన్న ఫ్రెండ్స్‌‌, ఫ్యామిలీ మెంబర్స్‌‌కంటే స్మార్ట్‌‌ఫోన్‌‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రోజులో ఎక్కువ సేపు ఫోన్‌‌తోనే గడిపేస్తున్నారు. అవసరానికి మించి ఫోన్‌‌ వాడుతున్నారంటే దానికి అడిక్ట్‌‌ అయినట్లే లెక్క. ఇలా అతిగా ఫోన్‌‌ వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. స్మార్ట్‌‌ఫోన్‌‌ ఎక్కువగా వాడే అలవాటును ఇలా తగ్గించుకోవచ్చు.

ఎక్కువగా స్మార్ట్‌‌ఫోన్‌‌ వాడుతుంటే ముందుగా ఫోన్‌‌ వాడే టైమింగ్‌‌ను తగ్గించుకోండి. ప్రతిసారి ఒక పావుగంట ఫోన్‌‌ పక్కనపెట్టాలి. దీనికోసం స్మార్ట్‌‌వాచ్‌‌ లేదా టైమర్‌‌‌‌తో అలారమ్‌‌ సెట్‌‌ చేసుకోవాలి. అలారమ్‌‌ మోగినప్పుడు మాత్రమే ఫోన్‌‌ చూడాలి. అది కూడా ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే నోటిఫికేషన్లు చూడాలి. తర్వాత ఎప్పట్లాగే ఫోన్‌‌ పక్కనపెట్టాలి. ఆ మరుసటి రోజు అరగంట, ఆ తర్వాత నలభై ఐదు నిమిషాలు, తర్వాత గంట.. ఇలా ఫోన్‌‌ దూరంగా ఉంచి, ఇదే పద్ధతి పాటించాలి.

ఎక్కువగా వాడే యాప్స్‌‌ను హోమ్‌‌ స్క్రీన్‌‌ నుంచి తీసేయాలి. వాట్సాప్‌‌, ఫేస్‌‌బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లాంటి అతిగా వాడే యాప్స్‌‌ను హోమ్‌‌ స్క్రీన్‌‌పై ఉంచుకోకూడదు.

నిద్రపోయే ముందు ఫోన్‌‌ను దూరంగా పెట్టుకోవాలి. అలాగే ‘అమెజాన్ ఎకో, గూగుల్‌‌ హోమ్‌‌’ వంటి స్మార్ట్‌‌ స్పీకర్స్ వాడాలి, వీటివల్ల ఫోన్‌‌ వాడకుండానే కాల్స్‌‌ చేసుకోవడం, మ్యూజిక్ ప్లే చేయడం, మెసేజెస్‌‌ చదవడం వంటివి జరుగుతాయి.

‘క్వాలిటీ టైమ్‌‌, మూమెంట్‌‌’ వంటి యాప్స్‌‌ను ఇన్‌‌స్టాల్‌‌ చేసుకుని స్మార్ట్‌‌ఫోన్‌‌ యాక్టివిటీస్‌‌ను ట్రాక్‌‌ చేయాలి. దీనివల్ల మొబైల్‌‌లో ఎక్కువగా టైమ్‌‌  ఎలా వేస్ట్‌‌ అవుతుందో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండొచ్చు.