బిగ్​సిలో సంక్రాంతి ఆఫర్లు

బిగ్​సిలో సంక్రాంతి ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు :  స్మార్ట్​ఫోన్ రిటైలర్​ బిగ్​సీ సంక్రాంతి పండుగ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్​ కొనుగోళ్లపై రూ.మూడు వేల వరకు ఇన్​స్టంట్​ డిస్కౌంట్​తోపాటు రూ.ఐదు వేల విలువైన స్మార్ట్​వాచ్​ను ఉచితంగా ఇస్తారు. స్మార్ట్​ఫోన్ ​ కొనుగోలుపై రూ.1.10 లక్ష విలువైన హెల్త్​కేర్​ ప్రయోజనాలు పొందవచ్చు. అంతేగాక రూ.75 వేల విలువైన పేటీఎం డిస్కౌంట్లను దక్కించుకోవచ్చని సంస్థ  ఫౌండర్​ బాలు చౌదరి చెప్పారు. వివో ఎక్స్​100 సిరీస్​ ఫోన్లనూ బిగ్​సీ స్టోర్ల ద్వారా అందుబాటులోకి తెచ్చారు.

ఈ మొబైల్స్​కొంటే 10 శాతం ఇన్​స్టంట్​ క్యాష్​బ్యాక్​, 11 వేల విలువైన ఫైర్​బోల్ట్​ స్మార్ట్​వాచ్, టీడబ్ల్యూఎస్​ బడ్స్​ఉచితం. రెడ్​మీ నోట్​ 13 సిరీస్​ ఫోన్ల కొనుగోలుపై రూ.రెండు వేల వరకు క్యాష్​బ్యాక్​, రూ.1,500 విలువ గల డిన్నర్​ సెట్​ ఉచితం. ప్రతి మొబైల్​/స్మార్ట్​టీవీ/ల్యాప్​టాప్​ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఇస్తారు. ఐఫోన్ ​కొంటే రూ.నాలుగు వేల వరకు ఇన్​స్టంట్​క్యాష్​బ్యాక్​ఇస్తారు.

వివో, ఒప్పో, వన్​ప్లస్, రియల్​మీ ఫోన్లపైనా రూ.మూడు వేల వరకు ఇన్​స్టంట్​ క్యాష్​బ్యాక్ పొందవచ్చు. రూ.10 వేల విలువైన ఫైర్​బోల్ట్​ స్మార్ట్​వాచ్​ను రూ.రెండు వేలకే దక్కించుకోవచ్చు. రూ.ఎనిమిది వేల విలువైన ఫైర్​బోల్ట్​ వాచ్​, ఇన్​బేస్​ టీడబ్ల్యూఎస్​ బడ్స్​ను రూ.1,799లకే సొంతం చేసుకోవచ్చు. వడ్డీ, డౌన్​పేమెంట్​ అవసరం లేకుండానే ఏటీఎం కార్డుతో ఎలక్ట్రానిక్​ ప్రొడక్టులను కొనొచ్చని బాలు చౌదరి చెప్పారు.