ఒడిశాలో.. డిబ్రూఘర్ – కన్యాకుమారి రైలులో మంటలు.. దూకేసిన ప్రయాణికులు

ఒడిశాలో.. డిబ్రూఘర్ – కన్యాకుమారి రైలులో మంటలు.. దూకేసిన ప్రయాణికులు

దేశంలో రోజూ ఒక్కో ఓ చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా వరసగా జరుగుతున్న సంఘటనలు ప్రయాణికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వ్యాపించి ఆరు బోగీలు తగలబడ్డాయి. ఈ సంఘటన మర్చిపోక ముందే.. 2023, జులై 11వ తేదీ ఒడిశా బరంపూర్ దగ్గర రైలులో మంటలు వచ్చాయి.

కోచ్‌లో పొగలు రావడంతో డిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్‌ను ఒడిశాలోని బ్రహ్మపూర్ స్టేషన్ సమీపంలో 30 నిమిషాల పాటు నిలిపివేశారు. బ్రేక్ బైండింగ్ కారణంగా కోచ్ చక్రంలో గోనె సంచి చిక్కుకోవడంతో పొగలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

#WATCH | Smoke witnessed in one of the coaches of Dibrugarh-Kanyakumari Vivek Express near Odisha’s Brahmapur Station due to brake binding as a sack got stuck in the wheel of a coach

"The smoke was not due to any mishap but brake binding as a sack had got stuck in a wheel of a… pic.twitter.com/MUSoIoS1lp

— ANI (@ANI) July 11, 2023

 

ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఎలాంటి ఏ ప్రమాదం కారణంగా ఈ ఘటన సంభవించలేదని చెప్పారు. కోచ్ చక్రంలో ఏదో బ్యాగ్ ఇరుక్కుపోవడంతో బ్రేక్ బైండింగ్ అయిందని, చక్రం నుంచి ఆ సంచిని తీసివేసి, మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బందిని కూడా రప్పించామని తెలిపారు. ఈ క్రమంలో రైలు దాదాపు 15-30 నిమిషాల పాటు ఆగిపోయిందన్నారు. బ్రహ్మపూర్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తామని రైల్వే అధికారి బసంత కుమార్ సత్పతి తెలిపారు.

అస్సాంలోని డిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు నడుస్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్ దూరం, సమయం పరంగా దేశంలోనే అతి పొడవైన రైలు మార్గం. రైలు ఈ మార్గంలో, మొత్తం తొమ్మిది రాష్ట్రాలను దాటుతుంది. 58 స్టాప్‌లతో ఈ రైలు అస్సాం, నాగాలాండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మీదుగా వెళుతుంది.

గత నెలలో, సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని ఏసీ యూనిట్ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో రైల్వే అధికారులు ఒడిశాలోని బ్రహ్మపూర్ స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. రైలు బి-5 కోచ్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు బ్రహ్మపూర్ స్టేషన్‌లో దిగారు. పొగలు అదుపులోకి వచ్చిన తర్వాత రైలు స్టేషన్‌ నుంచి బయలుదేరింది.

జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహరంగ బజార్ స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 293 మంది మరణించగా, 11వందల మందికి పైగా గాయపడిన తర్వాత తాజాగా ఈ సంఘటన జరిగింది.