మెరిసిన మంధాన, హర్మన్‌‌‌‌

మెరిసిన మంధాన, హర్మన్‌‌‌‌

ఈస్ట్‌‌‌‌ లండన్‌‌‌‌ (సౌతాఫ్రికా):  స్మృతి మంధాన (51 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 74 నాటౌట్‌‌‌‌), కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లతో 56 నాటౌట్‌‌‌‌) మెరుపు ఫిఫ్టీలతో సత్తా చాటడంతో టీ20 ట్రై సిరీస్‌‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌‌‌‌లో 56 రన్స్‌‌‌‌ తేడాతో  వెస్టిండీస్‌‌‌‌ను చిత్తు చేసింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 167/2 స్కోరు చేసింది. స్మృతి, హర్మన్‌‌‌‌  మూడో వికెట్‌‌‌‌కు 70 బాల్స్‌‌‌‌లోనే 115  రన్స్‌‌‌‌ జోడించారు. తర్వాత ఛేజింగ్‌‌‌‌లో విండీస్‌‌‌‌ ఓవర్లన్నీ ఆడి 111/4 స్కోరు మాత్రమే చేసింది. షెమైన్‌‌‌‌ కాంబెల్లే (47) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మకు రెండు వికెట్లు దక్కాయి. మంధాన ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌గా నిలిచింది.