
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన అరుదైన ఘనత సాధించింది. టీ20 క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసిన రెండవ భారత క్రీడాకారిణిగా నిలిచింది. మహిళల ఆసియా కప్ 2022 భాగంగా ఇవాళ థాయిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో మందాన ఈ ఫీట్ ను అందుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తరువాత ఈ మైలురాయి అందుకున్న రెండో భారత మహిళ క్రికెటర్ గా స్మృతి మందాన నిలిచింది. హర్మన్‌ప్రీత్ టీమిండియా తరపున 135 టీ20 మ్యాచ్‌లు ఆడింది.
మొత్తం వందో టీ20 మ్యాచ్ లలో స్మృతి మందాన 26.96 సగటుతో 2,373 పరుగులు చేసింది. ఇందులో 17 అర్ధ సెంచరీలు ఉండగా, అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 86 . ఇవాళ థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మందాన జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడం విశేషం. ఇందులో టాస్ గెలిచి స్మృతి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ జట్టు కేవలం 37 పరుగులకే ఆలౌట్ కాగా, లక్ష్యాన్ని టీమిండియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.