ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ లో ఐదో స్థానంలో స్మృతి మంధాన

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ లో ఐదో స్థానంలో స్మృతి మంధాన

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత సుస్థిరం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో మంధాన ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి మార్పు లేకపోయినా రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లను (743)ను మెరుగుపర్చుకుంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 64 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 124 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం మంధానాకు కలిసొచ్చింది. 

ఈ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంధా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10,880 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన  ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించింది. ఫలితంగా మిథాలీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10,868) రికార్డును అధిగమించింది. 18వ సెంచరీతో విమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక శతకాలు చేసిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి ఆరో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరింది. ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది.