74 ఏళ్ల వయసులో ఢిల్లీ మాజీ CS రాకేశ్ మెహతా సూసైడ్

74 ఏళ్ల వయసులో ఢిల్లీ మాజీ CS రాకేశ్ మెహతా సూసైడ్

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా(74) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం సెక్టార్ 82 కేంద్రీయ విహార్-2 సొసైటీలోని తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మెహతా చనిపోయారని పోలీసులు వెల్లడించారు. డయల్-112 ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫేజ్-2 పోలీస్ స్టేషన్ బృందం మెహతా ఫ్లాట్ వద్దకు చేరుకుంది. 

ఫ్లాట్ తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో పగలగొట్టి లోపలికి వెళ్లారు. మృతదేహాన్ని కిందకు దింపి, పోస్టుమార్టానికి తరలించారు. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్  లభించింది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగానే సూసైడ్ చేసుకుంటున్నట్టుగా అందులో రాసి ఉంది. ఆ సమయంలో మెహతా భార్య సుమంతి డెహ్రాడూన్‌లోని కొడుకు ఇంటికి వెళ్లారు.