వరల్డ్ కప్ 2025లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న ఈ టీమిండియా ఓపెనర్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లోనూ క్లాసికల్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. 58 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. తొలి వికెట్ కు షెఫాలీ వర్మతో 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్ వరల్డ్ కప్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళా ప్లేయర్ గా నిలిచింది.
ఇంగ్లాండ్‌లో జరిగిన 2017 వరల్డ్ కప్ ఎడిషన్ టోర్నమెంట్‌లో 409 పరుగులు చేసిన మిథాలీ రికార్డ్ బద్దలయింది. ఫైనల్ కు ముందు మందనాకు 21 పరుగులు అవసరం కాగా ఈ వైస్ కెప్టెన్ 45 పరుగులు చేసి ఈ రికార్డ్ తమ ఖాతాలో వేసుకుంది. మిథాలీని అధిగమించిన మందాన 434 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పునమ్ రౌత్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళా బ్యాటర్స్:
1 - స్మృతి మంధాన: 2025లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 434 పరుగులు
2 - మిథాలీ రాజ్: 2017లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 409 పరుగులు
3 - పునమ్ రౌత్: 2017లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 381 పరుగులు
4 - హర్మన్‌ప్రీత్ కౌర్ : 2017లో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 359 పరుగులు
5 - స్మృతి మంధాన: 2022లో ఏడు ఇన్నింగ్స్‌లలో 327 పరుగులు
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా భారీ స్కోర్ చేసి సౌతాఫ్రికాకు ఛాలెంజ్ విసిరింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (87)తో పాటు మిడిల్ ఆర్డర్ లో దీప్తి శర్మ(58) హాఫ్ సెంచరీలు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాకా మూడు వికెట్లు పడగొట్టింది. ట్రయిన్, నాడిన్ డి క్లెర్క్, నాన్కులులేకో తలో వికెట్ తీసుకున్నారు.
►ALSO READ | World Cup 2025 Final: బౌలర్లదే భారం: షెఫాలీ, దీప్తి హాఫ్ సెంచరీలు.. ఫైనల్లో సౌతాఫ్రికా ముందు ఛాలెంజింగ్ టార్గెట్!
