స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. చివరి నిమిషంలో ఏమైందంటే..?

స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. చివరి నిమిషంలో ఏమైందంటే..?

సాంగ్లీ: విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధాన, మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ పలాష్‌‌‌‌‌‌‌‌ ముచ్చల్‌‌‌‌‌‌‌‌ పెళ్లి వాయిదా పడింది. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా, వేడుకల్లో పాల్గొన్న మంధాన తండ్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.‘ఉదయం టిఫిన్‌‌‌‌‌‌‌‌ చేసే సమయంలో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ అనారోగ్యానికి గురయ్యారు. ఎడమ వైపు చాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కార్డియాక్‌‌‌‌‌‌‌‌ ఎంజైమ్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా ఉన్నాయని ఈసీజీ, ఇతర నివేదికల్లో బయటపడింది. 

బీపీ కూడా ఎక్కువగా ఉంది. దానిని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంచాం. మా వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. పరిస్థితి మరింత తీవ్రమైతే యాంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి ఫ్యామిలీ మాతో టచ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నారు. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో అతని పరిస్థితి స్థిరంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అని మంధాన ఫ్యామిలీ డాక్టర్‌‌‌‌‌‌‌‌ నమన్‌‌‌‌‌‌‌‌ షా వెల్లడించాడు. తండ్రి అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెళ్లిని నిరవధికంగా వాయిదా వేసినట్లు స్మృతి మేనేజర్‌‌‌‌‌‌‌‌ తుహిన్‌‌‌‌‌‌‌‌ మిశ్రా చెప్పాడు.