బీజేపీ మీటింగ్‌‌ ఉందంటూ ఫేక్​ ఎస్‌‌ఎంఎస్​లు

బీజేపీ మీటింగ్‌‌ ఉందంటూ ఫేక్​ ఎస్‌‌ఎంఎస్​లు

హైదరాబాద్, వెలుగు: ‘బీజేపీ కోర్ మీట్‌‌ 2’పేరుతో పార్టీ నేతలకు ఎస్ఎంఎస్‌‌లు వెళ్లడం కలకలం రేపింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని పద్మిని హోటల్‌‌లో ఈ మీటింగ్ ఉందంటూ చాలా మందికి మెసేజ్‌‌లు వెళ్లినట్లు బీజేపీ నేతల దృష్టికి వచ్చింది.

డాక్టర్ సురభి శ్రీనివాస్ పేరుతో ఈ ఎస్ఎంఎస్‌‌లు వెళ్లినట్లు గుర్తించిన పార్టీ నేతలు.. ఇదంతా బోగస్ అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమావేశాలను పార్టీ నేతలు నమ్మవద్దని, పార్టీ పేరుతో మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎంఎస్‌‌లు పంపిన శ్రీనివాస్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కోరారు.