
హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో మరోసారి పాము కలకలం రేపింది. గురువారం ( ఆగస్టు 7 ) యూనివర్సిటీలోని కిన్నెర వసతి గృహంలోని ఫస్ట్ ఫ్లోర్ లోని వాష్ రూమ్ దగ్గర పాము కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు స్టూడెంట్స్. పాము కనిపించిన విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు విద్యార్థులు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పామును బంధించారు. యూనివర్సిటీలో తరచూ పాములు వస్తుండటంతో క్యాంపస్ లో తిరగాలంటే వణుకుతున్నారు విద్యార్థులు.
ఇదిలా ఉండగా.. రెండు వారాల క్రితం కూడా యూనివర్సిటీలో పాము కలకలం రేపింది. సరస్వతి హాస్టల్ దగ్గర నాగుపాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు స్టూడెంట్స్. పాము కనిపించిన చోటే మెస్ కు, బయటకు వెళ్లే మార్గం ఉండటంతో అటుగా వెళ్లలేక ఇబ్బంది పడ్డారు స్టూడెంట్స్.
పామును చుసిన స్టూడెంట్స్ గదుల్లో నుంచి బయటకు రావాలన్నా కూడా భయపడ్డారు. పాము కనిపించిన విషయం సిబ్బందికి తెలియజేయడంతో దాన్ని బంధించారు. ఈ క్రమంలో హాస్టల్ దగ్గర గడ్డిని, చెత్తను ఎప్పటికప్పుడు తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్.
హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో మరోసారి పాము కలకలం రేపింది.... pic.twitter.com/TjnNwe37vh
— shekar chandu (@shekarswapna131) August 7, 2025