వీడియో : ఇంట్లోకి వచ్చి డబ్బులు దొంగతనం చేసిన పాము

వీడియో : ఇంట్లోకి వచ్చి డబ్బులు దొంగతనం చేసిన పాము

ఓ షాకింగ్ సంఘటనలో, ఒక పాము నోట్లను దొంగిలించి ఇంటికి డెలివరీ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియా యూజర్స్ ను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో, పొడవాటి పాము ఇంటి పక్కన నుంచి జారడం చూడవచ్చు. ఇంటి తలుపు ద్వారా ఇంటి లోపలికి వెళ్లిన ఆ పాము ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ వీడియో ప్రామాణికతపై పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో lindaikejiblogofficial అనే పేజీలో షేర్ అయింది. క్యాప్షన్ ప్రకారం ఈ వీడియో జింబాబ్వేలో రికార్డ్ చేయబడింది. కాగా దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. "ఫైనల్ గా మేము పామును పట్టుకున్నాం" అని ఒకరు అంటే.. "పాములు డబ్బు ఇవ్వవు, మింగుతాయి" అని ఇంకొకరు కామెంట్ చేశారు.