గన్నవరం ఎయిర్‌పోర్ట్ను కమ్మేసిన పొగ మంచు

గన్నవరం ఎయిర్‌పోర్ట్ను కమ్మేసిన పొగ మంచు

కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని పొగ మంచు కమ్మేసింది. ఈ ప్రభావంతో ఎయిర్‌పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ పొగ మంచు కారణంగా పలు విమానాలు గాల్లోనే చక్కెర్లు కొట్టాయి. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ కావాల్సివుండగా.. రన్ వేపై మంచు ఉండడంతో కొంత సేపు ఆకాశంలోనే చక్కెర్లు కొట్టింది. విమానం సుమారు గంట పాటు ఎయిర్ పోర్ట్ ఆవరణంలో అటూ ఇటూ తిరిగింది.

రన్‌వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో విమానాల ల్యాండ్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారలు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తామంటున్నారు.