
తమిళనాడులో భారీ అగ్నిప్రమాద జరిగింది. ఉత్తర చెన్నైలోని మనాలీ దగ్గర వైకాడు ప్రాంతంలోని సబ్బుపొడి గోదాంలో శనివారం (డిసెంబర్9) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు నష్టపోయాయి. వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.
అయితే ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన గ్యాస్ సిలిండర్ ఫ్యాక్టరీ కూడా మంటలు చెలరేగిన ప్రైవేట్ గోదాం సమీపంలో ఉంది. దీని కారణంగా మంటలు వ్యాపించాయి. దీంతో మనాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తమిళనాడు అగ్నిమాపక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రియా రవిచంద్రన్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఇప్పటి వరకు ( వార్త రాసే సమయానికి) ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని వారు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.