Sobhita Pregnancy: మొన్నే కదా పెళ్లైంది.. అక్కినేని వారసుడికి ఇంకా టైం ఉందిలే!

Sobhita Pregnancy: మొన్నే కదా పెళ్లైంది.. అక్కినేని వారసుడికి ఇంకా టైం ఉందిలే!

అక్కినేని నాగచైతన్య-శోభిత గతేడాది (2024) డిసెంబ‌ర్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా ఈ జంట గుడ్ న్యూస్ చెప్పిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్లయిన జంటలపై ఏడాదిలోనే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

గత కొన్నిరోజులుగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా బాగా వినిపించాయి. ఈ క్రమంలోనే లావణ్య నిజంగానే ప్రెగ్నెంట్ అనే విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసింది. దాంతో శోభిత కూడా తల్లి కాబోతోందనేది విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

దానికి తోడు రీసెంట్గా జ‌రిగిన 2025 వేవ్స్ స‌మ్మిట్లో.. శోభిత త‌న భ‌ర్త‌ నాగచైతన్యతో క‌లిసి పాల్గొంది. ఈ వేడుకలో శోభిత చీర‌లో రావ‌డంతో ఇక బాలీవుడ్ మీడియా శోభిత ప్రెగ్నెంట్ అనే విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేస్తూ పలు ఆర్టికల్స్ రాశారు.

ఎప్పుడూ మోడ్ర‌న్గా క‌నిపించే శోభిత, త‌న బేబీ బంప్ను క‌వ‌ర్ చేయ‌డానికి భిన్నంగా చీర‌లో వ‌చ్చింద‌ని తమ వార్తల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విష‌యంలో శోభిత క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం శోభిత తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోందని, మాతృత్వంపై ఇంకెలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. 

ఇలా సోషల్ మీడియాలో శోభిత ప్రెగ్నెంట్ అంటూ వస్తోన్న వార్తలపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ' ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే వాళ్ళే చెబుతారు కదా.. ఎందుకీ రూమర్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, అక్కినేని వారసుడికి టైం ఉంది.. మొన్నే కదా పెళ్లైంది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా గుడ్ న్యూస్ ఉంటే అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేయండి అంటూ నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. నాగచైతన్య పెళ్లి తర్వాత 'తండేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మైధాలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి వృషకర్మ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.