ఆజాద్ బాధితులు ఇంకెంత మంది..?ఆగని ఫిర్యాదులు.. క్యూకడుతున్న బాధితులు

ఆజాద్ బాధితులు ఇంకెంత మంది..?ఆగని ఫిర్యాదులు.. క్యూకడుతున్న బాధితులు

జూబ్లీహిల్స్, వెలుగు: సోషల్ మీడియా వేదికగా యువతులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న చంద్రశేఖర్ ఆజాద్​బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిందితుడు ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్​లో ఉన్నప్పటికీ.. అతడి చేతిలో మోసపోయిన బాధితులు వెలుగులోకి వస్తూనే ఉన్నారు.

 బుధవారం మరో యువతి పోలీసులను ఆశ్రయించి.. ఆజాద్ తనను ప్రేమ, పెండ్లి పేరుతో నమ్మించి రూ. 6 లక్షల నగదు, ఖరీదైన మొబైల్ ఫోన్ తీసుకున్నాడని ఫిర్యాదు చేసింది. మరో యువతిని కూడా ఇలాగే మభ్యపెట్టి ఆమె నుంచి బంగారు నెక్లెస్​ను కొట్టేసినట్లు తెలిసింది. సదరు బాధితురాలు కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. వరుసగా వస్తున్న ఈ ఫిర్యాదులతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.