సోషల్‌‌‌‌‌‌‌ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్ల మార్కెట్​ 900 కోట్లకు!

సోషల్‌‌‌‌‌‌‌ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్ల మార్కెట్​ 900 కోట్లకు!
  • 2025 నాటికి 2,200 కోట్లకు: రిపోర్ట్

న్యూఢిల్లీ: సోషల్‌‌ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్ల మార్కెట్ ఈ ఏడాది చివరి నాటికి రూ. 900 కోట్లకు చేరుకుంటుందని అంచనా.  సోషల్ మీడియా వాడకం దేశంలో పెరుగుతోంది. దీంతో బ్రాండ్లు, కంపెనీలు తమ ప్రొడక్ట్‌‌లను ఇన్‌‌ఫ్యూయెన్సర్ల ద్వారా  ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ మార్కెట్ ఏడాదికి 25 శాతం పెరిగి 2025 నాటికి రూ. 2,200 కోట్లకు చేరుకుంటుందని మీడియా బయ్యర్ గ్రూప్‌‌ఎం రిపోర్ట్  ఐఎన్‌‌సీఏ ఇండియా ఇన్‌‌ఫ్లూయెన్సర్‌‌‌‌ పేర్కొంది.  కరోనా టైమ్‌‌లో దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది.  సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్లను రెగ్యులేట్ చేసేందుకు ఓ సెల్ఫ్ రెగ్యులేటరీ కూడా పనిచేస్తోంది. ఇన్‌‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఇండస్ట్రీ విస్తరిస్తోంది. బ్రాండ్లు కూడా డైరెక్ట్‌‌గా కన్జూమర్లతో కనెక్ట్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయని ఈ రిపోర్ట్‌ పేర్కొంది. పర్సనల్ కేర్ (25 శాతం), ఫుడ్‌‌ అండ్ బేవరేజెస్‌‌ (20 శాతం), ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ (15 శాతం), మొబైల్‌‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌‌ (10 శాతం) కేటగిరీల్లో ఇన్‌‌ఫ్లూయెన్సర్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు.