సోషలిజంతో మమతా బెనర్జీకి పెళ్లి

V6 Velugu Posted on Jun 14, 2021

తమిళనాడులో సోషలిజానికి, మమతా బెనర్జీకి పెళ్లి జరిగింది. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వాస్తవంగానే అక్కడ పెళ్లి జరిగింది. సోషలిజం అనే అబ్బాయికి, మమతా బెనర్జీ అనే అమ్మాయికి పెళ్లైంది. సోషలిజం తండ్రి మోహన్.. సేలం జిల్లా సీపీఐ కార్యదర్శిగా ఉన్నారు. అమ్మాయి తాత.. గతంలో మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ఆమెపై అభిమానంతో మనవరాలికి మమతా బెనర్జీ అని పేరు పెట్టుకున్నారు. వీరి ఇద్దరి కుటుంబాలకు మధ్య మంచి బంధుత్వం ఉంది. ఆ బంధుత్వంతోనే సోషలిజానికి, మమతా బెనర్జీకి పెళ్లి జరిపించారు. ఈ పెళ్లి ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tagged tamilnadu, selam, mamata banerjee, communism, , Socialism weds Mamata Banerjee, Socialism, Leninism

Latest Videos

Subscribe Now

More News