కుటుంబ సభ్యులు కారణమంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణం

కుటుంబ సభ్యులు కారణమంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణం

తన చావుకు భార్య, అత్తమామలు, మరదలు కారణమంలూ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని రాజేంద్రనగర్ లో జరిగింది. రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహింపట్నంకు చెందిన  సుమంత్ రెడ్డికి శంషాబాద్ కు చెందిన మునుగాల స్వప్నతో ఫిబ్రవరిలో వివాహమైంది. వివాహమైన కొద్దిరోజుల తర్వాత రాజేంద్రనగర్ సర్కిల్ అత్తపూర్ లోని లక్ష్మీ ఫోర్ట్ వ్యు అపార్ట్ మెంట్ లో వీరు కాపురం ఉంపున్నారు. కొన్ని రోజులు సజావుగా సాగిన వారి కాపురంలో సుమంత్ రెడ్డిని భార్య స్వప్న కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు. స్వప్న తల్లి పద్మ, చెల్లెలు శ్రీలు, బాబాయ్ రాఘవేందర్ లు కలిసి సుమంత్ రెడ్డి ని వేధించసాగారు.

వారి వేధింపులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో ఆఫీస్ టెన్షన్స్ కూడా భరించలేని స్థాయికి చేరడంతో.. మనస్థాపం చెందిన సుమంత్ రెడ్డి ఇంట్లో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు  భార్య, అత్తమామలు మరియు మరదలు కారణమంటూ.. తాను చనిపోయాక వారందరిని కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్ రాసి మరణించాడు.

ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్ నోట్ స్వాదీనం చేసుకున్నారు. మృతదేహాన్ని మార్చరీకి తరలించి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా సుమంత్ రెడ్డి మృతి చెంది రెండు రోజులు గడిచినా.. నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని అతని బంధువులు అరోపిస్తున్నారు.