గచ్చిబౌలి, వెలుగు : సాఫ్ట్వేర్ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్అమ్ముతున్న ఐటీ ఎంప్లాయ్ని మాదాపూర్ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ముత్యాల సాయికిరణ్(28) గౌలిదొడ్డి కేశవనగర్ లోని నెస్ట్ ఇన్ హోమ్స్ లో ఉంటూ టెక్నికల్సపోర్ట్గా పని చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ నుంచి ఎండీఎంఏ కొని అమ్మాలని చూశాడు. దీంతో పక్కా సమాచారంతో పట్టుకున్నారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
