ఇవ్వాల ఉన్నం.. రేపు ఉంటమో లేదో.. దోస్త్​కు మెసేజ్‌ చేసిన తెల్లారే టెర్రరిస్టుల దాడిలో సోల్జర్ మృతి

ఇవ్వాల ఉన్నం.. రేపు ఉంటమో లేదో.. దోస్త్​కు మెసేజ్‌ చేసిన తెల్లారే టెర్రరిస్టుల దాడిలో సోల్జర్ మృతి

కాశ్మీర్: ‘సైనికుల జీవితం గురించి ఎవరు చెప్పగలరు.. ఈరోజు బాగున్నం, రేపు ఉంటమో లేదో ఎవరికి తెలుసు?’… చిన్న వయసులోనే సైన్యంలో చేరిన ఓ జవాను తన బాల్య మిత్రుడికి పంపిన వాట్సప్​ మెసేజ్​ ఇది. మెసేజ్‌‌‌‌ పంపిన మరుసటి రోజే ఆ జవాను నేలకొరిగిండు. టెర్రరిస్టులతో పోరాడుతూ కన్నుమూసిండు. దీంతో ఆ మెసేజ్​ అందుకున్న స్నేహితుడు కన్నీటిపర్యంతమైయిండు. శ్రీనగర్​ లోయలో గురువారం టెర్రరిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన జవాన్​ యశ్​ దిగంబర్​ దేశ్​ముఖ్ తన దోస్తుకు పంపిన ఈ మెసేజ్ ఇప్పుడు నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.

ఏం జరిగింది?

మహారాష్ట్రలోని జల్​గావ్​ జిల్లాకు చెందిన యశ్​ దేశ్​ముఖ్​20 ఏళ్ల వయసులోనే సైన్యంలోకి ఎంపికై, మరాఠా లైట్​ ఇన్​ఫాంట్రీ తరఫున శ్రీనగర్​ లోయలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం యశ్​ను తన చిన్ననాటి దోస్తు వాట్సప్​ల పలకరించిండు. ఎట్లున్నవ్, డ్యూటీ ఎట్లుంది, ఊరికి ఎప్పుడొస్తవ్ ​అంటూ విచారించిండు. దీనికి జవాబిస్తూ.. నేను బాగున్నా, కానీ మా జీవితాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇవ్వాల ఇక్కడున్నం, రేపు ఎక్కడ ఉంటమో’ అని మెసేజ్​ చేసిండు. మరుసటి రోజు(గురువారం) పాక్​ ప్రేరేపిత టెర్రరిస్టులు శ్రీనగర్​లో జరిపిన దాడిలో మరో జవానుతో పాటు యశ్ ​ప్రాణాలు వదిలిండు. యశ్​జవాబిచ్చిన వాట్సాప్​ స్క్రీన్​షాట్​ ఇప్పుడు సోషల్ ​మీడియాలో వైరల్​గా మారింది. యశ్​ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు, ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయిపోగా, తమ్ముడు స్కూలుకు వెళుతున్నాడని యశ్​ గ్రామస్తులు చెప్పారు.

For More News..

రోహిత్‌‌ అందుకే ఆసీస్‌‌ వెళ్లలేదు

ఒక్క చాన్స్​ ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం

హర్షద్ మెహతా వెబ్‌‌ సిరీస్‌‌తో పెరిగిన ఓటీటీ యూజర్లు