మెడను మెరిసేలా చేయడం ఎలా?

మెడను మెరిసేలా చేయడం ఎలా?

స్కిన్​ కేర్​ అనంగనే అందరి ఆలోచన ముఖం దగ్గరే ఆగుతుంది. అప్పుడప్పుడు కాళ్లు, చేతుల గురించి ఆలోచిస్తారు.  మరి మెడ మాటేంటి? శరీరంలో ఎక్కువగా ఎండకి ఎక్స్​పోజ్​  అయ్యే పార్ట్స్​లో మెడ కూడా ఉందిగా!  అందుకే దాన్నీ కాస్త పట్టించుకోవాలి. ముఖ్యంగా వేసవిలో.. ఈ  సీజన్​లో మెడ బాగా రంగుబారుతుంది

  • ఎర్రటి మచ్చలు, గీతలు కూడా పడుతుంటాయి.​ గరుకుగా అవుతుంటుంది కూడా. మరి వీటన్నింటికీ సొల్యూషన్​ ఏంటంటే..
  • ముఖం, చేతుల మాదిరిగానే మెడకి కూడా సన్​స్ర్కీన్​ తప్పనిసరి. లేదంటే మెడపై చర్మం వదులుగా అవుతుంది. రంగు మారుతుంది. అందుకే ప్రతిరోజూ మెడకి  సన్​స్ర్కీన్​ అప్లై  చేయాలి. దీనివల్ల ట్యాన్​తో పాటు మెడపై ముడతలు కూడా తగ్గుతాయి. అలాగే ఎండలో బయటికెళ్లినప్పుడు వీలైనంత వరకు స్కార్ఫ్​తో మెడని కవర్​ చేయాలి. 
  • శరీరంలో ఎక్కువగా ట్యాన్​ పేరుకుపోయేది మెడ దగ్గరే. పొడిబారడం, ఇరిటేషన్​ లాంటి సమస్యలు కూడా  మెడకే ఎక్కువ. వీటి నుంచి బయటపడాలంటే ఎక్స్​ఫొలేషన్ ద్వారా ఎప్పటికప్పుడు డెడ్​ స్కిన్​ సెల్స్​ని రిమూవ్ చేసుకోవాలి. చక్కెర, ఓట్​మీల్ లేదా స్పాంజ్​లతో మెడని మసాజ్​ చేయాలి. అలాగే విటమిన్​– సి ఎక్కువగా ఉండే ఫుడ్​ తీసుకుంటే  పిగ్మెంటేషన్​ సమస్య రాదు. అంటే మెడ దగ్గరి చర్మం నల్లబడదు. విటమిన్​–సి  ఇన్సులిన్​ ఉత్పత్తి పెంచి కొత్త చర్మ కణాల తయారీకి సాయపడుతుంది. స్కిన్​ని​ మాయిశ్చరైజ్​ చేసి మెరిసేలా చేస్తుంది.
  • మెడ దగ్గర చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొలాజెన్​ ముఖ్యం. దీనికోసం విటమిన్​–సి తో పాటు ఒమెగా– 3, ఒమెగా– 6 ఎక్కువగా ఉండే ఫుడ్​ని డైట్​లో చేర్చాలి. వీటిని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మరీ మంచిది. అలాగే స్కిన్​ మాయిశ్చరైజింగ్​కి  ఆల్ఫా హైడ్రోజన్​ యాసిడ్స్​​ని మించిన సోర్స్​ ఇంకోటి లేదు. గ్రీన్​ యాపిల్, బెర్రీస్, చెరుకు రసం, పైనాపిల్,  బొప్పాయి తినడం వల్ల  మెడ దగ్గరి స్కిన్​ హెల్దీగా ఉంటుంది. 
  • ఒక టీ స్పూన్​ ఆరెంజ్​ పీల్​ పౌడర్​లో పావు టీ స్పూన్​ పసుపు , ఒక టీ స్పూన్​ తేనె వేయాలి. ఆ మిశ్రమాన్ని పేస్ట్​లా చేసి మెడకి పట్టించాలి. పూర్తిగా ఆరాక చన్నీళ్లతో కడిగితే మెడ మెరుస్తుంది.  ఒక టీ స్పూన్​ కొబ్బరి నూనెలో అర టీ స్పూన్​ బాదం పౌడర్​, ఒక టీ స్పూన్​ చక్కెర కలిపి మెడకి ప్యాక్​​ వేసినా రిజల్ట్ బాగుంటుంది.