రుణమాఫీలో టెక్నికల్​సమస్యలను పరిష్కరిస్తం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రుణమాఫీలో టెక్నికల్​సమస్యలను పరిష్కరిస్తం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీకి సంబంధించిన టెక్నికల్ సమస్య లను పరిష్కరిస్తామని అగ్రికల్చర్​మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.  రెండవ విడత రైతు రుణమాఫీ వీలైనంత వేగంగా అమలు చేయటానికి రెడీగా ఉన్నామని తెలిపారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ మొదటి విడతగా రూ.లక్షలోపు లోన్లకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేశామని తుమ్మల గుర్తుచేశారు.

 వీటిలో 11.32 లక్షల కుటుంబాలకు రూ.6,014 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు.  టెక్నికల్​ ప్రాబ్లమ్స్​తో 17,877 అకౌంట్​లలో రూ.84.94 కోట్లు జమ కాలేదని వెల్లడించారు. ఆర్బీఐ సూచనలతో ఈ అకౌంట్ల టెక్నికల్​ సమస్యను డబ్బు జమ చేస్తామని హామీ ఇచ్చారు.