ఓల్డ్ సిటీలో నిరుద్యోగ సమస్య తీరుస్తం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఓల్డ్ సిటీలో నిరుద్యోగ సమస్య తీరుస్తం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •  స్కిల్ వర్సిటీతో ఉపాధి అవకాశాలు 

హైదరాబాద్, వెలుగు: పాతబస్తీ అభివృద్ధికి, అక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల్లో స్కిల్స్ పెంచి వారికి త్వరగా ఉపాధి దొరికేలా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శుక్రవారం ఓల్డ్ సిటీలో సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) చైర్మన్ గా గిరిధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 

దీనికి చీఫ్ గెస్ట్ లుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ పాతబస్తీని అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుస్తామన్న హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పాతబస్తీలో నిరుద్యోగిత రేటు 21శాతం ఉందని, 20 నుంచి 24 ఏండ్ల వారిలో 45 శాతానికి పెరిగిందన్నారు.