సోమాలియా పేలుళ్లు..100కు చేరిన మృతులు

సోమాలియా పేలుళ్లు..100కు చేరిన మృతులు

మరో 300 మందికి గాయాలు

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన రెండు వరుస పేలుళ్లలో 100 మంది చనిపోయారు. 300 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. జనాలు ఎక్కువగా ఉన్న ఏరియాను టార్గెట్​ చేసుకుని రెండు కారు బాంబులు పేల్చినట్టు సొమాలియా ప్రెసిడెంట్​ హసన్​ షేక్​ మహమ్మద్​ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేలుళ్ల వివరాలను  వెల్లడించారు.

తొలుత జోబ్​ చౌరస్తాలోని ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ ఆఫీస్​ వద్ద పేలుడు జరిగిందని చెప్పారు.ఆ ఏరియాలో వీధి వ్యాపారులు ఎక్కువగా ఉంటారని తెలిపారు.  గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్​లు, పోలీసులతో పాటు ఏంజరిగిందో తెలుసుకుందామని అక్కడికి జనం చేరుకున్న తర్వాత రెండో బ్లాస్ట్​ జరిగిందని హసన్​ షేక్​ చెప్పారు. లంచ్​ టైం కావడంతో కస్టమర్స్​తో బిజీగా ఉండే ఓ రెస్టారెంట్ ముందు రెండో పేలుడు సంభవించిందని చెప్పారు. కాగా, ఫస్ట్​ బ్లాస్ట్​ను కవర్​ చేసేందుకు వెళ్లిన ఒక జర్నలిస్ట్​ రెండోసారి జరిగిన పేలుడులో చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఓ అంబులెన్స్​ తుక్కుతుక్కు అయ్యింది. గాయపడినవారిని ఆస్పత్రుల్లో చేర్చి ట్రీట్​మెంట్ ఇప్పిస్తున్నట్లు ప్రెసిడెంట్​ వివరించారు. అల్​ షబాబ్​ టెర్రర్​ గ్రూప్​ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చన్నారు. 2017లో ఇదే స్పాట్​లో ట్రక్​ బాంబు పేల్చారని, అప్పుడు 500 మంది వరకు చనిపోయారని అన్నారు. ఈ ఘటనకు కూడా ఏ టెర్రరిస్టు గ్రూప్​ బాధ్యత వహించలేదని ప్రెసిడెంట్​ వివరించారు.