ఆయనకు అసమ్మతే వరం

ఆయనకు అసమ్మతే వరం

గోదావరిఖని, వెలుగు :రామగుండంలో సోమారపు సత్యనారాయణకు అసమ్మతి వరంగా మారింది. ప్రతిసారీ అసమ్మతి నేతలు
పోటీ చేస్తుండడంతో ఓట్లు చీలిపోయి ఆయనకు అనుకూలంగా మారుతుంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో పనిచేసిన సోమారపు సత్యనారాయణ..తన ఉద్యోగానికి రాజీనామా చేసి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. రామగుండం మున్ సిపాలిటీకి మొదటిసారి జరిగిన ఎన్ని కల్లో కాంగ్రెస్ నుంచి ఛైర్మన్ పదవికి పోటీ చేశారు. అప్పుడు అధికార పార్టీ
అయిన టీడీపీ నుంచి గోపు అయిలయ్య ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అసమ్మతి నేతలు సిరిమల్ల జయరాములు, కొత్త రాజిరెడ్డి, కొండ జయరాములు, డాక్టర్ వెంకటేశ్వర్లు, బందారపు లక్ష్మయ్య గౌడ్ రెబెల్స్‌గా పోటీకి దిగారు. ఎన్ని కల్లో 17 వేల ఓట్లు వచ్చిన సోమారపు త్యనారాయణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయిలయ్య యాదవ్ కు దాదాపు 16 వేల ఓట్లు వచ్చాయి . టీడీపీ రెబెల్స్‌కు దాదాపు 35 వేల ఓట్లొచ్చాయి . అసమ్మతి నేతలు పోటీలో ఉండడమే ఆ ఎన్నికల్లో సోమారపు విజయానికి కారణమైంది. 2014లోనూ రామగుండం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేశారు.ఈ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీంపాష కు వ్యతిరేకంగా కౌశిక్ హరినాధ్ రెబెల్‌గా పోటీ చేశారు. కాంగ్రెస్ హయాంలో శాప్ చైర్మన్ఉన్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వైఎస్ఆర్ సీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు ఆపార్టీని కూడా వదిలి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. హరి నాథ్‌ దాదాపు 13 వేల ఓట్లు, మక్కాన్‌సింగ్‌ 11వేల ఓట్లు సాధించారు. బాబర్ సలీంపాషకు 16,900 ఓట్లు వచ్చాయి . హరి, మక్కాన్‌ సింగ్‌లు కాంగ్రెస్‌ ఓట్లే కావడంతో సోమారపు సునాయాసంగా గెలువగలిగారు. గతంలో రెబెల్‌ అభ్యర్థుల వల్ల గెలిచినట్టు భావిస్తున్న సోమారపు ఈ సారి తానే అసమ్మతిని ఎదుర్కొంటు న్నారు. 2014 ఎన్ని కల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచి 33,494 ఓట్లు పొం దిన కోరుకంటి చందర్ ఈసారి కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్ ఆశిం చిన రామగుండం జడ్పిటీసీ కందు ల సంధ్యారాణి కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్టీపీసీ మాజీ ఉద్యోగి పెద్దం పేట శంకర్ బీఎస్పీ టిక్కెట్ పై పోటీ చేయడానికి సిధ్దమవుతున్నారు. వీరంతా టీఆర్‌ఎస్‌ ఓట్లు చీల్చుకుంటే పరిస్థితి ఎంటని చర్చ జరుగుతుంది.