
బాల కార్మిక చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 14ఏళ్లలోపు పిల్లలు ఎవరూ పనిచేయడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా 14ఏళ్లలోపు పిల్లలు పనిచేస్తే పనిలో పెట్టుకున్న యజమానితో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షకు అర్హులని హెచ్చరించింది సర్కార్. పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానికి 25వేల 50వేల జరిమానా .. 6నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష వేస్తామని హెచ్చరించింది. ఈ నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామంటున్న కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ తో ప్రేమ్ ఫేస్ టు ఫేస్.