హైబ్రిడ్​ వర్కింగ్​కు కొన్ని ఐటీ కంపెనీల ఓటు

హైబ్రిడ్​ వర్కింగ్​కు కొన్ని ఐటీ కంపెనీల ఓటు
  • 70 శాతం సంస్థల అభిప్రాయం ఇదే
  • ‘ఆఫీస్​’ నిర్వహించిన సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయించడానికి 70 శాతం సంస్థలు ఇష్టపడటం లేదు. ఆఫీసులకు రావాలని అడుగుతున్నాయి. ఆఫీసు నుంచే పనిచేయాలని కోరుకుంటున్నామని 90 శాతం ఫార్మా కంపెనీలు అంటున్నాయి. అయితే టెక్నాలజీ, రిటైల్​ సెక్టార్​ కంపెనీల్లో  50 శాతం కంపెనీలు హైబ్రిడ్​ విధానాన్ని కోరుకుంటున్నాయి. టెక్​ ఎనబుల్డ్​ వర్క్​ప్లేస్​ ప్రొవైడర్​  ‘ఆఫీస్,​ క్యూడీఈఎస్​క్యూ’ కలిసి చేసిన సర్వే ద్వారా ఈ వివరాలు తెలిశాయి. రాబోయే 12 నెలల్లో మెజారిటీ కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తమ బిజినెస్​ను పెంచుకోవాలని లేదా విస్తరించాలని చూస్తున్నాయని, అయితే 40శాతం కంపెనీలు ఇప్పటికీ హైబ్రిడ్ వర్కింగ్ ఆలోచనను ఇష్టపడుతున్నాయని సర్వే పేర్కొంది. ఆన్​–డిమాండ్​, ఫ్లెక్సిబుల్ ఆఫీసులకు డిమాండ్​ పెరుగుతున్నందున ఈ మార్కెట్​ ఇంకా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. " ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్లకు మంచి భవిష్యత్​ ఉంది. విస్తరణకు ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకోవచ్చు. ఈ తరహా ఆపరేటర్లు నగరాల్లో తమ ఉనికిని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. అన్ని రకాల ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్​ల అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేయాలి”అని ‘ఆఫీస్’​ ఫౌండర్​ అమిత్ రమణి అన్నారు.  అన్ని సైజుల కంపెనీల్లో దాదాపు 35–-40శాతం హైబ్రిడ్ పని విధానాన్ని ఇష్టపడతాయని సర్వే పేర్కొంది. 

కరోనాతో పని పద్ధతులు మారాయ్​..

కరోనా సమయంలో ఎక్కువ మంది ఫ్లెక్సిబిలిటీ (నచ్చినట్టుగా పనిచేసుకోవడం)కి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా మెజారిటీ ఉద్యోగులు ఇదే విధానాన్ని కోరుకుంటున్నారు. అనేక ప్రదేశాలలో కంపెనీలు ఆఫీసులను డెవెలప్​ చేస్తున్నప్పటికీ,  హైబ్రిడ్ వర్క్ మోడల్‌‌‌‌‌‌‌‌ను కూడా కొనసాగించడానికి సంస్థలు ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌లతో కలసి పనిచేస్తున్నాయి. దాదాపు 45శాతం కార్పొరేషన్లు  ఫ్లెక్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులతోపాటు కొత్త ఆఫీసుల నిర్మాణం కోసం నగరాల్లో జాగాలను కొంటున్నాయి. వీటిలో 35శాతం ఇప్పటికే కోవర్కింగ్​ స్పేస్​ఆపరేటర్ల  సహకారంతో మల్టీ–-ఆఫీస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ‘‘కరోనా తరువాత కో–వర్కింగ్​ స్పేస్ ​ఇండియాలో బాగా ఎదిగింది. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ విధానానికి మారాయి’’ అని ‘ఆఫీస్’​ డిప్యూటీ సీఈఓ సుమిత్ లఖానీ అన్నారు. 70శాతానికిపైగా చిన్న సంస్థలు ఆఫీసు నుండి ఉద్యోగులతో పని చేయించడానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే పెద్ద సంస్థల్లో 70శాతం కంపెనీలు హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ను ఇష్టపడుతున్నాయి.  ఈ సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది రెస్పాండెంట్లు తమ ఉద్యోగుల పని అవసరాలను తీర్చడానికి కోవర్కింగ్​ కంపెనీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అయితే 30శాతం కంపెనీలు మాత్రం తక్కువ ఖర్చు గల ఆఫీసుల కోసం వెతుకుతున్నాయి. "మారుతున్న మార్కెట్ డైనమిక్స్‌‌‌‌‌‌‌‌తో సంస్థలు అభివృద్ధి చెందుతున్నందున హైబ్రిడ్, వర్క్​ ఫ్రం హోం, ఆఫీస్‌ విధానాలూ మారాయి. కోవర్కింగ్​ స్పేస్​కు గిరాకీ పెరిగింది ”అని క్యూడీఈఎస్​క్యూ సీఈఓ పారస్ అరోరా అన్నారు.