ఇదేం నిమజ్జనం.. పిచ్చి చేష్టలు.. పైత్యపు పనులు.. ఇలాంటోళ్లు గణేశ్ విగ్రహం ఎందుకు పెడతరో.. ఏందో !

ఇదేం నిమజ్జనం.. పిచ్చి చేష్టలు.. పైత్యపు పనులు.. ఇలాంటోళ్లు గణేశ్ విగ్రహం ఎందుకు పెడతరో.. ఏందో !

గణేశ్ నిమజ్జనాలకు వేళయింది. భక్తి శ్రద్ధలతో పూజించుకున్న గణపయ్య విగ్రహాన్ని అంతే పవిత్రంగా నిమజ్జనం చేస్తేనే పూజలకు ఒక అర్థం.. పరమార్థం ఉంటుంది. అంతేగానీ.. విగ్రహం నిలబెట్టినన్ని రోజులు పూజలు మంచిగ చేసి నిమజ్జనం చేస్తున్న సందర్భంలో గణేశ్ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేయడం, ఎలా పడితే అలా విగ్రహాన్ని విసిరిపడేయడం దారుణమైన విషయం. ఈ వీడియోను చూస్తే హిందువుల మనోభావాలు దెబ్బతినడం ఖాయం. ఇది AI వీడియో అనుకుంటే పొరపాటే. ఒరిజినల్ వీడియోనే. వినాయక నిమజ్జనంలో ఇలాంటి పైత్యపు పనులు, పిచ్చి చేష్టలు సిగ్గు చేటు.

ఇలాంటి వాళ్లు అసలు విగ్రహాలను ఏర్పాటు చేయకపోవడమే మేలని ఈ వీడియో కింద భక్తులు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు భక్తి లేదు. దేవుడిపై ఎలాంటి నమ్మకం లేదు. జోష్ కోసం.. దోస్తులతో కలిసి తాగి రచ్చ రచ్చ చేయడం కోసం.. వినాయక చవితికి విగ్రహాలను పెడుతుంటారని.. నిమజ్జనం రోజున నానా యాగీ చేస్తుంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది ఎప్పటి వీడియోనో, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు గానీ ఇంత అపవిత్రంగా, జుగుప్సాకరంగా గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడం చూసి ఉండరు.

గణనాధుడిని విగ్రహాన్ని నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయకుడికి సంబంధించిన వస్తువులు విసిరివేయకూడదు. వినాయకుడిని బోర్లా (వెనుక వైపు) నుంచి నీటిలో ముంచకూడదు. కేవలం ముందు భాగం నుంచి మాత్రమే నీటిలో నిమజ్జనం చేయాలి. నీటిలో దిగే సమయంలో కింద విగ్రహాలను కాళ్లతో తొక్కకుండా జాగ్రత్తలు పాటించాలి. డప్పులు, మేళ తాళాలకు, హంగు, ఆర్భాటాలకు ఇచ్చిన ప్రాధాన్యత నిమజ్జన పూజా విధానానికి ఇవ్వకపోవడం శోచనీయం.