
సంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు పిల్లల్ని బస్టాండులో వదిలివెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే.. పటాన్ చెరు బస్టాండ్ లో 5 ఆగస్ట్ 2024 సాయంత్రం ఇద్దరు చిన్న పిల్లల్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. ఇందులో ఒక బాబు(4), పాప(1) మాటలు కూడా సరిగ రాని పిల్లలు తమ వారి కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయారు.
ఎవరు రాక పోవడంతో పిల్లలను బస్టాండ్ స్వీపర్ అక్కున చేర్చుకున్నారు. స్థానికులు పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానకి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ICDS అధికారులను సంప్రదించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పిల్లలను గుర్తించి తెలిసిన వాళ్లు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.