చక్కటి నిద్ర కోసం చిట్కాలు

చక్కటి నిద్ర కోసం చిట్కాలు

మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. రాత్రి సమయంలో ఎంత హాయిగా నిద్రపోతే మరుసటి రోజు అంత యాక్టివ్‭గా ఉంటాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రి సమయంలో చాలా మంది నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నిద్ర పట్టక.. పగటిపూట వర్క్ చేసే సయమంలో కునికిపాట్లు పడుతుంటారు. అయితే సరైన నిద్ర పట్టకపోవడానికి జీవనశైలిలో మార్పులు కూడా ఒక కారణమని నిపుణులు అంటున్నారు. అలాగే.. సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరం పనితీరు దెబ్బతింటుందని చెబుతున్నారు. 

  • ప్రతి మనిషికి రాత్రిళ్లు 7 నుంచి 8 గంటల నిద్ర అవరసరం. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా చక్కని నిద్ర పోయేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. 
  • పడక గదిలో  18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చల్లని వాతావరణంలో హాయిగా నిద్రపడుతుంది. ఏదైనా శబ్ధం నిద్రకు భంగం కలిగించవచ్చు. అందుకే ఎలాంటి సౌండ్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే చాలా మందికి లైట్లు ఆన్‭లో ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టదు. 
  • ఫోన్లు, ల్యాప్ ట్యాప్‭లు, టీవీల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను డిస్ట్రబ్ చేస్తుంది. అందుకే నిద్రపోయేందుకు గంట ముందు వీటిని దూరంగా పెట్టాలి. 
  • ప్రతి రోజు నిద్ర పోయేందుకు ఒక సమయం పెట్టుకోవాలి. ఇక పడుకునే ముందు కొద్దిసేపు వాకింగ్ చేసినా, బుక్స్ చదివినా మంచిది. అలాగే చర్మ సంరక్షణ కోసం రాత్రి పూట చల్లని నీటితో ముఖం కడుక్కుని పడుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. 
  • గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా నిద్ర పోయేందుకు కనీసం రెండు, మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. సాయంత్రం సమయంలో కెఫిన్, ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించాలి. నిద్ర పోయే ముందు ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
  • ఇక చివరిగా సాయంత్రం సమయంలో ఎక్కువగా ఎక్సర్ సైజులు చేయకుండా.. యోగా, తేలికపాటి వ్యాయామాలు చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాగే హాయిగా నిద్ర పోయేందుకు ఇవి సహాయ పడతాయి.