ఐఫోన్​, ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్ ఎందులోనైనా ఫొటో బాగా రావాలంటే

ఐఫోన్​, ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్ ఎందులోనైనా ఫొటో బాగా రావాలంటే
  • కెమెరా లెన్స్ క్లీన్​గా ఉండాలి. ఏ ఫొటో అయినా క్లారిటీగా రావాలంటే లెన్స్ క్లీన్​ చేసుకున్నాక ఫొటో తీయాలి.
  • ఫొటోగ్రఫీకి నేచురల్ లైట్​ చాలా బెటర్​. అందుకే ఫొటోలు తీసేటప్పుడు నేచురల్​ లైట్ ఎక్కడ పడుతుందో చూసుకుని అక్కడ ఫొటోలు దిగాలి. 
  • గ్రిడ్ లైన్స్ వాడటం వల్ల ఫొటో కరెక్ట్​గా వస్తుంది. అందుకోసం కెమెరా సెట్టింగ్స్​లో గ్రిడ్ లైన్స్ ఫీచర్ ఆన్​ చేయాలి. ఫొటో తీయాలనుకున్న ఆబ్జెక్ట్​తో పాటు చుట్టూ ఉన్న ఎలిమెంట్స్ కూడా కనపడేలా తీయాలి. 
  • యాంగిల్స్ మారుస్తూ ఎక్స్​పరిమెంట్స్ చేయొచ్చు. ఫొటోలు తీసేటప్పుడు రకరకాల యాంగిల్స్ ట్రై చేయొచ్చు. 
  • క్లాసిక్ ఫొటోగ్రఫీ టెక్నిక్​ వాడి... అడ్డంగా, నిలువుగా ఎలా అయినా ఫొటో తీయొచ్చు. ఫొటో తీయాలనుకున్న సబ్జెక్ట్​ పొజిషన్​ని ఫోకస్ చేయాలి. 
  • ఫొటో బాగా కనిపించాలంటే దగ్గరగా తీయాలి. అందుకు జూమ్ ఫీచర్ వాడొచ్చు. కాకపోతే అది వాడితే ఇమేజ్​ క్వాలిటీ సరిగా రాదు.  
  • ఫ్లాష్​ వాడొద్దు. ఫొటో తీసేటప్పుడు ఫ్లాష్​ వాడకపోవడం బెటర్. ఫ్లాష్ వాడితే ఫొటోలు బాగా రావు. వాటిలో లైటింగ్ సరిగా ఉండదు. దానికి బదులు నేచురల్ లైట్ లేదా వేరే ఏదైనా లైట్ వాడితే బెటర్. 
  • తీసిన ఫొటోలు ఇంకాస్త బెటర్​గా కనిపించాలంటే ఎడిటింగ్ చేయాలి. బ్రైట్​నెస్, కాంట్రాస్ట్, శాచ్యురేషన్ వంటివి మార్చొచ్చు. 
  • ఫొటోలు బాగా తీయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్​పరిమెంట్స్ చేయాలి. డిఫరెంట్ టెక్నిక్స్ వాడి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి.