స్పెయిన్: కొందరు ఇల్లు, మరికొందరు విల్లా కొనాలనుకుంటారు. ఏకంగా ఓ గ్రామమే అమ్మకానికి వస్తే.. అదీ ఓ ఖరీదైన ఫ్లాట్ ధరకు సమానమైతే.. కొంటే బాగుంటుందనిపిస్తోంది కదా! స్పెయిన్‌లో ఓ ఫ్యామిలీ ఇలాంటి ఆఫరే ప్రకటించింది. పోర్చుగల్ బార్డర్.. జమోరా ప్రావిన్స్‌లోని తమకు చెందిన సాల్టో డీ కాస్టో అనే గ్రామాన్ని 2.27 లక్షల యూరోలకు(రూ.2.16 కోట్లు) అమ్ముతామని పేర్కొంది. స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్ నుంచి 3 గంటల్లో సాల్టో డీ కాస్టోకు చేరుకోవచ్చు. ఈ విలేజ్‌లో 44 ఇండ్లు, హోటల్, చర్చి, స్కూల్, మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. అయితే 30ఏండ్లుగా ఈ విలేజ్‌లో ఎవరూ ఉండట్లేదు. 1950 ప్రాంతంలో అక్కడ రిజర్వాయర్ నిర్మించాలనుకున్నరు. లేబర్స్ ఉండేందుకు అప్పటి గవర్నమెంట్ ఇండ్లు కట్టించింది. రిజర్వాయర్ పూర్తయ్యాక ఒక్కొక్కరుగా పక్కనున్న టౌన్‌కు వెళ్లిపోయారు.
1990లో ఊరంతా ఖాళీ అయిపోయింది. 2000 ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఈ విలేజ్‌ను కొన్నది. టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలనుకుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా సక్సెస్ కాలేదు. దీంతో విలేజ్‌ను అమ్మేద్దామని స్పెయిన్‌కు చెందిన ఐడియాలిస్టా అనే ప్రాపర్టీ రిటైల్ కంపెనీని కాంటాక్ట్ చేసింది. ఊళ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ధరెంత? అనే వివరాలన్నీ ఐడియాలిస్టా తన వెబ్సైట్లో పెట్టింది. తాను సిటీలో ఉంటానని, విలేజ్‌ను మెయింటేన్ చేయడం కష్టంగా ఉందని ఓనర్ వెబ్సైట్లో వివరించాడు. విలేజ్‌పై రూ.1.66 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 100% డెవలప్ అవుతుందని చెప్పాడు. ధర ఎక్కువ ఉండటంతో ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. తర్వాత మార్కెట్ విలువ పెరగడంతో బెల్జియం, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా నుంచి 300మంది ఆసక్తి చూపిస్తున్నట్టు ఐడియాలిస్టా ప్రతినిధి రోడ్రిగజ్ తెలిపారు.
